తెలంగాణ

ట్రంప్ పర్యటనపై భగ్గుమన్న వామపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతతకు దారితీసింది. వామపక్షాలకు చెందిన సీనియర్ నేతలు అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. బోయినపల్లి స్టేషన్‌లో ఉన్న నేతలను కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, రాములు నాయక్ సహా ఇతర పార్టీల నేతలు వచ్చి పరామర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన పూర్తిగా స్వార్థంతో, వ్యాపార ప్రయోజనాలతో కూడుకున్నదని, అమెరికా నుండి వ్యవసాయానికి సంబంధించిన అనేక హానికర పురుగు మందులను ఉత్పత్తులను అలాగే విషపూరితంగా కూడుకున్న కాళ్లను మన దేశానికి దిగుమతి చేసుకోవాలని ఒప్పందం చేసుకోవడం జరిగిందని, దీనివల్ల దేశ ప్రజల ఆరోగ్యాలు చెడిపోతాయని అన్నారు. అలాగే భారత్ ఆర్ధిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని చెప్పారు. భారత్ ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ - మోదీ కేళీవిలాసాలతోనే సరిపోయిందని, అక్కడ భారతీయులపై ట్రంప్ తీరని ఆంక్షలు విధిస్తున్నారని, ఆ అంశాలను ప్రస్తావించకుండానే తన పర్యటన ముగించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. క్యూబా, పాలస్తీనా, ఇరాన్ తదితర దేశాలపై అమెరికా సామ్రాజ్యవాద దురహంకారంతో వ్యవహరిస్తూ, ఆయా దేశాల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ కుటిల నీతిని ప్రదర్శిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ గౌరవార్ధం ప్రధాని ఇచ్చే విందులో పాల్గొనేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం దారుణమని , ఇది గర్హనీయమని అన్నారు. ట్రంప్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించిన సీపీఐ నేతలు డాక్టర్ కే నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎన్ బాలమల్లేశ్, డాక్టర్ డీ సుధాకర్, యువజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, రావి శివరామకృష్ణ తదితరులను అరెస్టు చేసి బోయినపల్లి , కార్వాన్, తిరుమలగిరి పోలీసు స్టేషన్లకు తరలించారని అన్నారు. పోలీసుల తీరు గర్హనీయమని, వెంటనే వారిని విడుదల చేయాలని చాడ వెంకటరెడ్డి కోరారు.
కేసీఆర్‌ను ఎవరూ కాపాడరు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనను నిరసించిన సీపీఐ నేతలను అరెస్టు చేయడం దారుణమని చాడ వెంకటరెడ్డి అన్నారు. బేగంపేట పోలీసులు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణకు సెక్షన్ 41ఎ కింద నోటీసులు ఇవ్వడం దారుణమని అన్నారు. నోటీసును తిరస్కరిస్తూ నారాయణ సమాధానం ఇచ్చారని అన్నారు. ఒకవైపు సీఏఏ పేరుతో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేసీఆర్ మరోవైపు ట్రంప్‌కు ఇచ్చిన విందుకు హాజరుకావడంపై ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు.

*చిత్రాలు.. అమెరికా కాన్సులేట్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలను అదుపులోకి తీసుకొంటున్న దృశ్యం
*పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీపీఐ నేతలను పరామర్శిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్