తెలంగాణ

త్వరలో కొత్త మున్సిపల్ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 26: త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టం రాబోతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన ఆకస్మికంగా పాల్గొన్నారు. 75 గజాల స్థలం ఉన్నట్టయతే కేవలం రూపాయి మాత్రమే మున్సిపాలిటీలో చెల్లించి భవనాన్ని నిర్మించుకోవచ్చునని అన్నారు.
600 లోపు గజాలలో భవనాన్ని నిర్మించుకోవాలునుకున్నట్టయతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో బిల్డింగ్ అనుమతులు ఇంటికే వస్తాయన్నారు. పట్టణాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి పల్లె ప్రగతి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి ప్రారంభం అయ్యిందని ఆయన చెప్పారు. ముందుగా ఆయన జనగామ పట్టణంలోని దళితవాడలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కానున్న మున్సిపల్ చట్టం చాలా డేంజర్‌గా ఉంటుందన్నారు.
పనిచేయని ప్రజాప్రతినిధులపై వేటు పడే విధంగా ఈ చట్టం ఉందన్నారు. అంతే కాకుండా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలలో 85 శాతం మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని లేనట్టయతే వారి పదవులు ఊడుతాయని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసం దళారులను ఆశ్రయించ వద్దని, ప్రభుత్వమే పేదలను వెతుక్కుంటూ వెళ్లి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల్లు అందిస్తుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వద్ద సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఉందని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే మరిన్ని నూతన పథకాలు వస్తాయన్నారు. ఏప్రిల్ మాసం నుండి కొత్త పెన్షన్లను అందిస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పట్టణ, గ్రామాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిపాలన సౌల్యభ్యం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ప్రజల వద్దకే అధికారులు వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆరే ఘనుడు అని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, పైగా మరొ నాలుగు ఏళ్ల వరకు ఇక ఎన్నికలు లేవన్నారు. పార్టీలకు అతీతంగా పట్టణాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే ప్రతి వార్డుకు సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి తెలిపారు.
పట్టణ యువజన కమిటీలు వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జనగామ పట్టణంలో రెండు నెలల్లో 100 టాయిలెట్ల నిర్మాణం జరిగినట్టయతే తాను మరో మూడు నెలల్లో ఇక్కడికి వస్తానని తెలిపారు. పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్ధానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమున, కలెక్టర్ నిఖిల, జనగామ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరి, కార్పొరేటర్లు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*చిత్రాలు.. జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
*దళితవాడలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి