తెలంగాణ

‘ ఫీల్డ్ అసిస్టెంట్లు’ ఇక ఇంటికేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 26: ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల భవిష్యత్ అయోమయంలో పడింది. భారత రాజ్యాంగం ద్వారా 2005, ఆగస్టు 25వ తేదీన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తున్న చట్టం కాలక్రమేణా ఉపాధిహామీ పథకంగా మారింది. నిబంధనల ప్రకారం నైపుణ్యంలేని వయోజనులు అందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో ఆ ప్రాంత పరిధిలోనే పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించి ఉపాధికి తోడ్పాటును అందించాల్సి ఉంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించి ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డును అందజేసి పని కల్పించటంతోపాటు వారి ఆర్థిక స్థితిని మెరుగు పరిచేందుకు పథకం దోహదపడింది.
అయితే ఈ పథకం విజయవంతం కావటంలో తొలి నాళ్ల నుంచి పథకంలో పని చేసే క్షేత్ర సహాయకులు (్ఫల్డు అసిస్టెంట్ - ఎఫ్‌ఏ)లు కీలక పాత్ర పోషించారు. ఒక్కో పంచాయతీకి ఒక్కరు చొప్పున ఫీల్డు అసిస్టెంట్‌ను నియమించటంతో అక్కడి పేదలను గుర్తించటం, వారికి అవసరమైన పని కల్పించటం, కూలీల మస్టర్లు, నివేదికలను తయారు చేసిన అనంతరం కూలీల వేతనాలను అందించటంలో ఎఫ్‌ఏలు నిరంతరం శ్రమించారనటంలో సందేహం లేదు. మండు టెండల్లో సైతం కూలీలతో పాటు పని ప్రదేశాల్లో ఉండి విధులు నిర్వహించటంలో ఎఫ్‌ఏలు పడిన శ్రమకు సైతం గుర్తింపు లభించింది. అయితే గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ఎఫ్‌ఏల పట్ల తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వారి ఉద్యోగ భద్రతకు సమస్యగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకు ప్రతి ఏటా పంచాయతీ పరిధిలో ఉన్న జాబ్ కార్డులకు జూన్ 1వ తేదీ నుంచి తిరిగి జూలై 31 వరకు 7వేలు పని దినాలు కలిపిస్తే ఎఫ్‌ఏల కాంట్రాక్టు అగ్రిమెంటు రెగ్యులర్ అయ్యేది. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 4779 నంబరు జీవో వారికి గుదిబండగా తయారైందని వాపోతున్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి జాబ్ కార్డుకు 40శాతం పని దినాలు కలిపిస్తేనే అగ్రిమెంటు రెన్యువల్ చేస్తారు. ఒక వేళ 25 నుంచి 40శాతం మధ్య టార్గెట్‌ను మాత్రమే ఎఫ్‌ఏలు రీచ్ అయితే సీనియర్ మేట్‌గా మారిపోతారు. లక్ష్యం మరింత తగ్గిన ఎఫ్‌ఏల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. వారు స్వయంగానే ఉద్యోగం నుంచి తొలగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంతే కాకుండా లక్ష్యం తగ్గిన ఎఫ్‌ఏలకు సైతం గత మూడు నెలలుగా వేతనం అందక పోవటంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు బాధపడుతున్నారు.
ఈ 4773 జీవో వలన ఉద్యోగ భద్రత కోల్పోతున్నామని, అన్ని స్థాయిల్లోని ఉన్నతాధికారులకు న్యాయం చేయాలని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని ఎఫ్‌ఏలు వాపోతున్నారు. 15 ఏళ్లుగా ఉపాధిహామీ పథకంలో పని చేసినా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కారణంగా కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎఫ్‌ఏల బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుందని ఎఫ్‌ఏలు మరోవైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి విధులపై కొత్తగూడెం డీఆర్‌డీవో కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన కొందరు కార్యదర్శులకు శిక్షణ ఇవ్వటం కూడా వారి అనుమానానికి బలం చేకూర్చుతుంది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 31న సీఆర్‌డీ నుంచి 258 జీవోను విడుదల చేస్తూ పంచాయతీ కార్యదర్శులకు మండల స్థాయిలోనే ఎఫ్‌ఏ విధులపై శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రోగాం అధికారులు ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలతో సమన్వయం చేసుకొని ఉపాధిహామీ చట్టం, పని డిమాండ్, పని కల్పన, హాజరు, ఈ మస్టర్, పథకం అమలుపై కార్యదర్శులకు ఒక రోజు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం కొత్త, కొత్త జీవోలను జారీ చేస్తుండటం, ఉపాధిహామీ పథకం అమలుపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దపడుతుండటంతో ఫీల్డు అసిస్టెంట్లలో అభద్రతాభావం మరింత పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న ఎఫ్‌ఏల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరోక్షంగా విధుల నిర్వాహణ పట్ల కూడా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం విజయవంతం అయ్యేందుకు ఏళ్ల తరబడి అహర్నిశలు కృషి చేస్తున్న ఎఫ్‌ఏల పట్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని మార్చుకొని తమకు న్యాయం చేయాలని ఫీల్డు అసిస్టెంట్లు విజ్ఞప్తి చేస్తున్నారు.