తెలంగాణ

డీసీసీబీ, డీసీఎంఎస్‌లు గులాబీకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, జిల్లా కో-అపరేటీవ్ మార్కెటింగ్ సొసైటీలు అన్నింటినీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం లాంఛనప్రాయమే. 29న జరుగనున్న డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలక వర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో అన్ని డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గాలు అన్నీ టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి. నల్లగొండ జిల్లాల్లో గెలుచుకున్న ఒకే ఒక్క డైరెక్టర్‌తో ప్రతిపక్ష కాంగ్రెస్ సరిపెట్టుకుంది. రాష్టవ్య్రాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల డైరెక్టర్ పదవులకు నామినేషన్లు స్వీకరించగా ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో 180 డీసీసీబీ డైరెక్టర్లకుగాను 148 డైరెక్టర్లు, డీసీఎంఎస్‌ల్లో 90 డైరెక్టర్లకుగాను 74 డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. డీసీసీబీల్లో రిజర్వు చేసిన కేటగిరీలకు కేటాయించిన 33 డైరెక్టర్ పోస్టులకు నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే డీసీఎంఎస్‌ల్లో రిజర్వు చేసిన కేటగిరీలకు కేటాయించిన 16 డైరెక్టర్ పోస్టులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో వీటిని మినహాయించి మిగతా డైరెక్టర్లే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఏకగ్రీవమైన డైరెక్టర్లంతా అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో పాలక వర్గాలన్ని టీఆర్‌ఎస్సే కైవసం చేసుకోనుంది.