తెలంగాణ

మంచిర్యాలే అడ్డా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం ఉగ్రవాద సానుభూతిపరులకు అడ్డాగా మారుతోందని పోలీస్ ఉన్నతాధికారులు పసిగట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య ఉన్న మంచిర్యాలలో ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరులు ఆశ్రయం పొందుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఇటీవల ఘటనలు రూఢీ చేస్తున్నాయి. ఈనెల 12న అరెస్టయిన అతావుల్లాఖాన్ రహ్మాన్‌ను రెండో దఫా కస్టడీలోకి తీసుకొని ఢిల్లీ తీసుకెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు, నిందితుడి నుంచి కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా విధ్వంసాన్ని సృష్టించేందుకు ఐసిస్ సానుభూతిపరులు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో మకాం వేసి మహరాష్ట్ర, తెలంగాణల్లో తమ కేడర్‌ను పెంచుకునేందుకు యత్నించినట్టు తెలిసింది. 2002లో టెర్రరిస్టు అజాం ఘోరి ముందుగా మందమర్రి, మంచిర్యాల పట్టణాల్లోనే ఆశ్రయం పొందాడు. అక్కడినుంచి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు మకాం మార్చాక, ఉప్పందుకున్న కేంద్ర బలగాలు ఎన్‌కౌంటర్‌లో అతడిని మట్టుబెట్టాయి. అలాగే 2013లో మంచిర్యాలకు చెందిన ఆతిఫ్ వసిం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి సిరియా చేరుకున్నాడు. ఐసిస్‌లో చేరి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉగ్రదాడుల్లో సిరియాలో మృతి చెందాడు.తాజాగా మంచిర్యాల నుంచే ఆరుగురు ఉగ్రవాద మద్దతుదారులను ఎన్‌ఐఏ గుర్తించింది. వారిని విచారించిన ఎన్‌ఐఏ మహారాష్ట్ర, తెలంగాణ జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా పెట్టింది.
ఇటీవల అరెస్టయిన ఉగ్ర సానుభూతిపరుల్లో ఒకరైన నాసిర్ అలియాస్ ఖదీర్‌ను మహరాష్ట్ర ఔరంగాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటిఎస్) అధికారులు విచారించారు. నాసిర్ వెల్లడించిన వివరాలు కేంద్ర నిఘా వర్గాలను కలవరపడుతున్నాయి. పర్బణి జిల్లాకు చెందిన ఈ 31ఏళ్ల ఇంజనీర్ సైతం సిరియా కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు సిద్ధమయ్యాడు. ఈనెల 17 ఇతడిని అరెస్టు చేసిన ఏటిఎస్ అధికారులు వారం రోజులు కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారించారు. ఈనేపథ్యంలో ఐసిస్ అగ్రనేతల ఆదేశాల మేరకు కొన్ని బాంబులు తయారు చేసిన నాసిర్, వాటి ఫొటోలు తీసి సోషల్ మీడియా ద్వారా సిరియా పంపినట్టు తెలిసింది. ఈ బాంబుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు మహారాష్టల్రోని నాగపూర్, పుణెలతోపాటు హైదరాబాద్ నుంచి తనకు అందాయని నాసిర్ ఏటిఎస్ అధికారుల విచారణలో వెల్లడించాడు.
అప్రూవర్‌గా అతావుల్లా?
తెలంగాణలో భారీ విధ్వంసానికి పాల్పడే కుట్రతో ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న జుందుల్ ఖిలాఫత్ మిలాద్ అల్ హిందీ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ అతావుల్లా రహ్మాన్‌ను అప్రూవర్‌గా మార్చాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. రహ్మాన్‌ను రెండో దఫా కస్టడీకి తీసుకొని ఢిల్లీకి తరలించడం వెనుక ఇదే కారణమని సమాచారం. అప్రూవర్లు అందించిన సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారడంతోపాటు సాక్ష్యాధారాల సేకరణకూ ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలుస్తోంది. సాధారణంగా మాడ్యూల్‌లో పని చేసినప్పటికీ నేరంతో ప్రమేయం లేని వారినే ఎన్‌ఐఏ అధికారులు అప్రూవర్‌గా మారుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఐసిస్ అనుబంధ సంస్థ జెకెబిహెచ్ మాడ్యూల్‌కు సంబంధించిన అతావుల్లాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

చిత్రం... అనుమానిత ఉగ్రవాదులు (ఫైల్)