తెలంగాణ

మీ చిత్తశుద్ధికి పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: హరితహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏ మేరకు భాగస్వాములు అయ్యారో తెలుసుకునేందుకు సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలు జరుపుతానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుస్పష్టం చేశారు. తాను తనిఖీలకు వచ్చినప్పుడు ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హరితహారం కార్యక్రమంలోనే ఉండాలని, ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి పాల్గొంటానని తెలిపారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మంత్రి హరీశ్‌రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీనియర్ అధికారులు ఎస్‌కె జోషి, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్ తదితర అధికారులతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హరితహారం పనుల అమలును సిఎం కెసిఆర్ సమీక్షించారు. వివిధ వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని అనుసరించి ఆయా జిల్లాల మంత్రులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సీజన్‌లో 46 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కార్యాచరణ లక్ష్యసాధనకు తోడ్పడాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హైదరాబాద్ తరహాలో డివిజన్ల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా మంచి వర్షాలు పడుతున్నాయని పేర్కొన్న సిఎం ఇలాంటి సానుకూల వాతావరణాన్ని మొక్కల పెంపకానికి బాగా ఉపయోగించుకోవాలని సూచించారు. నాటిన మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో ఎండి పోకుండా చూసుకోవాలని, వర్షాలు పడకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఫైర్ ఇంజన్లు,గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలలోని మంచినీటి ట్యాంకర్లను వినియోగించుకుని మొక్కలకు కాపాడుకోవాలని ఆదేశించారు. మొక్కలు నాటడం, రక్షించడం, నీళ్లు పోయడం వంటి పనులకు 1500 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతరత్రా ఖర్చు పెట్టడానికి వెసులుబాటు కల్పించామన్నారు. చివరి మొక్క నాటే దాకా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కలెక్టర్లతో పాటు ఇతర అధికారులు ఇదే పనిలో ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్, విఆర్‌ఓ, విఎఓ, ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఇందులో నిమగ్నం కావాలని, ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని చెప్పారు. తాను జరిపే ఆకస్మిక తనిఖీలు హరితహారం పట్ల ప్రతి ఒక్కరి నిబద్ధతకు నిదర్శనమవుతుందన్నారు. ఈ తనిఖీ ఫలితాల ద్వారానే వారి పనితీరును అంచనా వేస్తామన్నారు.

చిత్రం... హరిత హారంపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్