తెలంగాణ

కృష్ణానదికి పెరిగిన వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణానది వరద ఒక్కసారిగా పెరిగింది. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదికి మళ్లీ జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు వరద పెరిగి నిండుకుం డలా మారింది.
దాంతో జూరాల ప్రాజెక్టు ఏడు గేట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఎత్తివేసి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టులోకి 69540 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. దీంతో బీచ్‌పల్లి దగ్గర నది ప్రవహం ఉద్ధృత్తమైంది. జూరాల ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి దాదాపు 80000 క్యూసెక్కుల వరద వస్తుండగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 69540 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. అంతేకాకుండా జూరాల ప్రాజెక్టు దగ్గర ఐదు యూనిట్ల ద్వారా 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తికి జూరాల ప్రాజెక్టు నుండి 40000 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. విద్యుత్ ఉత్పత్తికి వదిలిన నీరు కూడా కృష్ణానది నుండి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీటితో కలిసి చేరుతుంది.
జూరాల ప్రాజెక్టుకు మరో రెండు మూడు రోజుల పాటు ఇదే తరహాలో వరద వస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు సైతం వరద నిరంతరంగా కొనసాగి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంటుంది. గేట్లు ఎత్తివేసే సమయం లో ఓ గేటు తెరుచుకోకపోవడంతో కొద్దిసేపు జూరాల ప్రాజెక్టు అధికారులు ఉలిక్కిపడ్డారు. గేటు మొరాయించడంతో అధికారులు పడరాని పాట్లు పడ్డారు. చివరకు మిగతా గేట్లతో పాటు మొరాయించిన గేటు కూడా తెరుచుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గత సంవత్సరం ఒకటి రెండు రోజులు మాత్రమే వరద రావడంతో అప్పటి నుండి గేట్లు మూసి వేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని అధికారులు చెప్పుకొచ్చారు.