తెలంగాణ

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన: భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 7: ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున డీసీసీబీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు అడ్డుకున్నారని మండిపడ్డారు. సుమారు 150 మంది గుండాలతో నామినేషన్ వేయకుండా అడ్డుతగిలారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా స్పీకర్ అవకాశం ఇవ్వలేదని వాపోయారు. నిత్యం రూల్స్ గురించి మాట్లాడే మంత్రి కేటీఆర్ నిబందనలకు విరుద్ధంగా వ్యివహరించారని అన్నారు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగుతూ నిబందనలకు పాతరేసి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. వందలాది, వేలాది ఏకరాలను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నాలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓలను కాలరాసిన కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అవకాశం అర్హత లేదని అన్నారు.
టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంగా సభ
*కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు
ప్రజల సమస్యలపై జరగాల్సిన సభను టీ ఆర్ ఎస్ ఎల్పీ సమావేశంగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు మండిపడ్డారు. సభా హక్కులను స్పీకర్ పరిరక్షిస్తారని భావించి సభకు హాజరు అయ్యామని, అందుకు విరుద్ధంగా సభ జరుగుతుందని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కను సైగలతో శాసన సభ ప్రొసీజర్‌ను పక్కన పెట్టి ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ సస్పెండ్ చేశారని అన్నారు.
శ్రీనివాస్ రెడ్డి నామినేషన్‌ను అడ్డుకోవడం తీవ్ర విచారకరమని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన మంత్రులే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమి ఉంటుందని పేర్కొన్నారు.
సీఎం కుటుంబానికి ప్రజలే బుద్ధి చెబుతారు
*కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నిజాం నిరంకుశత్వాన్ని తలపించేలా పాలన సాగిస్తున్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలే తగిన విధంగా బుద్దిచెబుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యమ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేక పోయారని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ తొత్తులు తనను ఉరికించి కొడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. తెలంగాణ విద్రోహులను అక్కున చేర్చుకొని సీఎం కేసీఆర్ నిజాం నవాబును తలదనే్నలా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల రోజు రైతుబంధును రైతుల ఖాతాల్లో వేస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులేవు, ఇంటింటికి నీరు రాలేదని విమర్శించారు. ఇక నియామకాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని రెండవ సారి పీఠం ఎక్కిన కేసీ ఆర్ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతిని అందించలేదని విమర్శించారు. తెలంగాణ మించిన తెలంగాణ ద్రోహి ఇంకెవరూలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నైతిక విలువలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని దుయ్యబట్టారు. లోక్ సభ ఎన్నికల్లో సారు, కారు, పదహారు అంటూ టీ ఆర్ ఎస్ నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. నియంతృత్వ దోరణితో పాలించిన నియంతలకు బుద్దిచెప్పిన విధంగానే తెలంగాణ ప్రజలు కేసీ ఆర్ బుద్దిచెప్పే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.
ప్రతిపక్షాల తీరు శోచనీయం
*అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు శోచనీయమని అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పసలేని పక్షాలుగా మారాయని ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఆయా పార్టీలను తిరస్కరిస్తున్నప్పటికీ ప్రభుత్వంపై ఎలా విమర్శలు గుప్పిస్తారని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. సభలో నిర్మాణాత్మకమైన చర్చ జరిగేలా ప్రతిపక్షాలు వ్యవహరించాలని సూచించారు.