తెలంగాణ

సీఏఏ ముగింపునకు కటాఫ్ తేదీ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: పౌరసత్వసవరణ చట్టం సెక్యులర్ దేశానికి వ్యతిరేకమని, దీనిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. శనివారం ఆయన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పౌరసత్వసవరణ చట్టం తెచ్చారు. కాని ఇందులో ఎంత కాలం ఈ చట్టం అమలులో ఉంటుందనే క్లాజు లేదు. కటాప్ తేదీ ఉండాలి. ఈ చట్టంలో పేర్కొన్నట్లుగా ఆయా వర్గాల వారు ఆ మూడు దేశాల నుంచి వచ్చి కేంద్రహోంశాఖకు దరఖాస్తు చేసుకుంటారు. ఇలా ఎంత కాలం చేసుకుంటారు. ఎన్ని రోజులు ఈ చట్టం అమలులో ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. తప్పనిసరిగా ఈ చట్టంలో సన్‌సెట్ క్లాజు ఉండాలి. లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఈ చట్టం అమలులో ఉంటుందో తెలియదు. దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వకుండా సమాజాన్ని మతంపేరుతో చీల్చుతూ ఆడుకుంటోందన్నారు. భారతదేశం సెక్యులర్ వ్యవస్థకు ప్రతీకన్నారు. ఈ దేశంలో బీజేపీ మతం రంగుపులుముతూ ప్రజలను విభజిస్తోందన్నారు. ఎన్‌పీసీ, ఎన్‌ఆర్‌సీ వల్ల మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు ఇక్కట్లు ఎదుర్కొంటారన్నారు. కేసీఆర్ పాలనను ప్రశంసిస్తూనే, పాతబస్తీకి మెట్రో రైల్వే వ్యవస్థను పొడిగించాలని, మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియచేసే తీర్మానానికి పరిమితం కావాలని, సీఏఏ తదితర అంశాలు మాట్లాడవద్దని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. కాగా మజ్లిస్ సభ్యులు సీఏఏపై మాట్లాడడంపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.