తెలంగాణ

ప్రగతిశీల బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2020-21 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఇది సంక్షే మ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా సీఎం అభివర్ణించారు. రాష్ట్ర ఆదాయ వనరులు-రాష్ట్ర ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌గా పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షే మం-అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మ్యాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధులలో కోతలు పడినప్పటికీ రాష్ట్భ్రావృద్ధి కుంటుపడకుండా ఉండే లా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమని సీఎం ప్రశంసించారు. రాష్ట్రంలో గ్రామా లు, పట్టణాల వికాసం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాలలో మరింతమంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి హరీశ్‌రావును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని, బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులను కూడా సీఎం అభినందించారు.
*చిత్రం... బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు