తెలంగాణ

ఆత్మహత్యపై అనేక అనుమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం ఆయన సొంత ఊరైన మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి హైద్రాబాద్‌లోని ఖైరాతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్యభవన్‌లో అద్దెకు తీసుకున్న గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు దూరమైందన్న మనస్థాపం.. పణయ్ హత్య కేసులో శిక్ష పడుతుందనే భయంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన తిరునగరు మారుతీరావు స్థిరాస్తి వ్యాపారి... ఒక్కగానొక్క కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ను కిరాయి హంతక ముఠాతో 2018 సెప్టెంబర్‌లో దారుణంగా హత్య చేయించారు. ఇందుకోసం పట్టణానికి చెందిన ఎండీ.ఖరీంతో పాటు ఐఎస్‌ఐ తీవ్రవాద కేసులున్న అజ్ఘర్‌అలీ, భారీలతో కలిసి హత్యకు పథకం రచించారు. దీనిలో భాగంగా 2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ హత్య జరిగింది. గర్భిణీగా ఉన్న భార్య అమృతతో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా కత్తితో దాడి చేసి ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ కేసులో మారుతీరావుతో పాటు ఐదుగురుని అరెస్టు చేశారు. వీరిపై పోలీసులు అప్పట్లో పీడీ యాక్టును నమోదు చేశారు. అయితే హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావుతో పాటు ఆయన సోదరుడు తిరునగరు శ్రవణ్‌కుమార్, మిగిలిన నిందితులకు 8నెలల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఇటీవల వారు బయటకు వచ్చారు.
హైద్రాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో శనివారం రాత్రి గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు ఆదివారం ఉదయం వరకు బయటకు రాలేదు. కార్ డ్రైవర్ మారుతీరావు ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆర్యవైశ్యభవన్ సిబ్బంది గది తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మారుతీరావు చనిపోయి ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు విచారణను చేపట్టారు. అయితే మారుతీరావు తన గదిలో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించిన పోలీసులు అక్కడ మారుతీరావు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఇచ్చిన బెయిల్‌ను దుర్వినియోగం చేసే విధంగా వ్యవహరించాడంటూ ఇటీవల మారుతీరావుపై మరోకేసు నమోదయింది. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మారుతీరావు మధ్యవర్తులతో రాయబారం కూడా పంపారు. అయితే దీనిపై అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులో తనను కాంప్రమైజ్ కావాలంటూ బెదిరిస్తున్నారని తెలపడంతో మరోసారి పోలీసులు మారుతీరావును, ఆయనకు మద్దతుగా వెళ్లిన వారిని కూడా అరెస్టు చేశారు. దీంతో పాటు 10 రోజుల క్రితం మిర్యాలగూడలోని మారుతీరావుకు చెందిన నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి వెంట హనుమాన్‌పేటలో ఉన్న పాతబడిన భవనంలో అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. ఏ మాత్రం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో శవం లభించింది. జైలు నుండి విడుదలైన తరువాత మారుతీరావు ఎవరికీ, ఎక్కడా పెద్దగా తారసపడకపోవడంతో చనిపోయింది మారుతీరావే అన్నట్టు ప్రచారం కూడా జరిగింది. అయతే అది మారుతీరావు మృతదేహం కాదని నిర్ధారణ రావడంతో చనిపోయింది ఎవరు...దీనికి మారుతీరావుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ విషయంలో కూడా మారుతీరావుపై ఆరోపణలు, అనుమానులు వ్యక్తం అయ్యాయి. ప్రణయ్ హత్య కేసులో కోర్టు విచారణను వేగవంతం చేసింది. జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నాయి. హాజీపూర్ కేసు తరహాలో విచారణను త్వరగా పూర్తి చేసేందుకు ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాజిక్యూటర్ నరసింహ్మాను నియమించారు. హంతకుడు ప్రణయ్‌ను కత్తితో నరికి చంపడం సీసీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో పాటు కేసులో ఇతర సాక్ష్యాలు కూడా బలంగా ఉండడంతో తనకు తప్పక శిక్ష పడుతుందని మారుతీరావు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. జైలు జీవితం గడపవలసి వస్తుందనే భయంతోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు అందరూ భావిస్తున్నారు. దీంతో పాటు ఆస్తివ్యవహారాలు కూడా ఆత్మహత్యకు దారి తీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కూతురు కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద శిక్ష పడుతుందనే భయంతోనే తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకోని మృతి చెందినట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసుకు సంబంధించి కూతురు అమృతను తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కకపోగా తిరిగి తండ్రిపై, అతనికి సహకరించిన వారిపై ఫిర్యాదు చేయడంతో మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రణయ్ హత్య కేసు నుండి బయట పడేందుకు ఎలాంటి దారులూ కనపడకపోవడంతో మారుతీరావు మిర్యాలగూడలోని తన స్నేహితులకు సంబంధించిన ఫర్టిలైజర్ షాపులో క్రిమిసంహారక మందును కొనుగోలు చేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ.
*తిరునగరు మారుతీరావు (ఫైల్‌ఫొటో)