తెలంగాణ

ఆది నుంచి వివాదాస్పదుడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మార్చి 8: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతీరావు ఆది నుండి వివాదాస్పదుడే... మారుతీరావు తండ్రి కిరోసిన్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే మారుతీరావు, అతని తమ్ముడు శ్రవణ్ మొదటి నుండి పలు వివాదాలకు కారకులు. మారుతీరావు రెవెన్యూ అధికారులను తన గుప్పెట్లో ఉంచుకొని మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని భూములను కబ్జా చేసినట్టు పలు ఆరోపణలు ఉన్నాయి. రైస్ ఇండస్ట్రీలో ఆసియా ఖండంలోనే ద్వితీయ స్థానంలో ఉన్న మిర్యాలగూడ పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. దాంతో మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని భూములకు రెక్కలు వచ్చాయి. అయితే మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులను తన గుప్పట్లో ఉంచుకొని కోటాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిన సంఘటనలు ఉన్నాయి. పట్టణంలోని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి వెంట పట్టణం సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారుల సహకారంతో కబ్జా చేశారు. అయితే గతంలో గ్యాంగ్‌స్టర్ నయాం సైతం తిరునగరు మారుతీరావు భూకబ్జాలు చేస్తున్న నేపథ్యంలో అతడిని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలోనే నయాంకు, మారుతీరావుకు మధ్య ఒప్పందం కుదిరి పరస్పర సహకారంతో పలు భూకబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెలువత్తాయి. తిరునగరు మారుతీరావు, తమ్ముడు శ్రవణ్‌కుమార్ మొదటి నుండి కూడా మిర్యాలగూడ పట్టణంలో వివాదాస్పద వ్యక్తులే. తిరునగరు శ్రవణ్ కూడా పలు ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయ. అతి తక్కువ సమయంలో మారుతీరావు, శ్రవణ్ పట్టణంలో కోట్లకు పడగలెత్తారు. పట్టణంలోని అత్యంత విలువైన నటరాజ్ థియేటర్, శకుంతల థియేటర్‌లను సైతం కొనుగోలు చేశారు. నటరాజ్ థియేటర్‌ను కూల్చివేసి ఆ స్థలంలో భారీ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నాడు. అదే విధంగా నార్కట్‌పల్లి-అద్దంకి రాహదారిపై శరణ్యహిల్స్ కాలనీని కూడా మారుతీరావు తమ్ముడు శ్రవణ్ నిర్మించే సమయంలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు దాడులు చేశారు. అయితే ఈ సమయంలో మారుతీరావు ఏకైక కుమార్తె అయన అమృత కులాంతర వివాహం చేసుకోవడంతో సహించలేని మారుతీరావు కిరాయి హంతకులతో అమృత భర్త ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయ. ఈ కేసులో జీవిత ఖైదీ పడుతుందన్న భయంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. కాగా మారుతీరావు ఇంటి వద్ద, అమృత మామగారి ఇంటి వద్ద పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహం ఆదివారం రాత్రి మిర్యాలగూడకు రానున్నట్టు సమాచారం.