తెలంగాణ

పశ్చాత్తాపం కావొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 8: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రథమ నిందితుడైన తిరునగరు మారుతీరావు మరణం మీడియా ద్వారానే తెలిసిందని ఆయన కుమార్తె, ప్రణయ్ భార్య అమృత తెలిపింది. ఆదివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రణయ్‌ను హత్య చేసానన్న పశ్చాతాతపంతో మృతి చెంది ఉంటాడని ఆమె అన్నారు. మారుతిరావు ఎలా మరణించారో తనకు తెలియదని, తన భర్త హత్య కేసులో న్యాయం జరుగుతుందని ఆశించానన్నారు. తన భర్త హత్య అనంతరం తన తండ్రి మారుతీరావుతో సంబంధాలు లేవన్నారు.
గా ప్రణయ్ హత్యకేసు నిందితుడు తిరునగరు మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత మాట్లాడేటప్పడు ఆయనను తండ్రి అని, నాన్న అని కూడా సంబోధించలేదు. పదేపదే అతడు అని మాట్లాడింది. కాగా మారుతీరావు మృతితో పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే సెప్టెంబర్ 14, 2018న ప్రణయ్ హత్య జరిగినప్పటి నుండి నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ బందోబస్తుగా ఉండేవారు. అయితే ఆ బందోబస్తును ఇద్దరికి కుదించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మారుతీరావు మృతితో బాలస్వామి ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు వారం రోజుల పాటు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
*చిత్రం... విలేఖర్లతో మాట్లాడుతున్న అమృతప్రణయ్