తెలంగాణ

ఆడశిశువును ఆసుపత్రిలో వదిలివెళ్లిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, మార్చి 8: ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతుంటే కన్నపేగును కాదనుకున్న ఓ తల్లి అర్థరాత్రి ఆడశిశువును ఆసుపత్రి అవరణలో వదిలి వెళ్లిన సంఘటన కల్వకుర్తిలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుప్రతి ప్రహరీగోడ సమీపంలో శనివారం అర్థరాత్రి చంటిబిడ్డ ఏడుపు వినిపించడంతో సిబ్బంది వెళ్లి చూడగా 15 రోజుల వయసున్న ఆడశిశువు కన్పించింది. ఎవరో గుర్తు తెలియని మహిళ ఆ బిడ్డను అక్కడ వదిలేసినట్టు సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసుపత్రి అవరణలో వదిలి వెళ్లిన శిశువుతల్లిదండ్రుల గురించి ఆరా తీస్తున్నామని, సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నామని, అలాగే బిడ్డను శిశు గృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశామని కల్వకుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు.

*చిత్రం... కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వదిలిన ఆడశిశువు