తెలంగాణ

ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమాన ప్రయాణికులందరికీ థర్మో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 11-12 దేశాల నుండి హైదరాబాద్ వస్తున్న వారికి మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకనుండి
ఏ దేశం నుండి హైదరాబాద్ వస్తున్న వారెవరిరికైనా థర్మో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ పరికరాలను సోమవారంనాడు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ 5,500 మంది ప్రయాణికులు విదేశాల నుండి ఈ ఎయిర్‌పోర్టుకు వస్తుంటారని, వారిని స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. స్కానింగ్ చేసిన వ్యక్తి జలుబు, జ్వరం, దగ్గు తదితర విధాలుగా అనారోగ్యంతో ఉంటే వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రత్యేక రూంకు తీసుకువెళ్లి, మాస్కులు వేసి ప్రత్యేక వాహనంలో ప్రత్యేక ద్వారం నుండి గాంధీ దవాఖానాకు పంపిస్తామన్నారు. మంగళవారం నుండి 24/7 విధానంలో స్క్రీనింగ్ చేస్తామన్నారు. ఒక్క ప్రయాణికుడు కూడా పరీక్షల నుండి తప్పించునే వీలులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటల వివరించారు.
*చిత్రం... శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ థర్మో స్క్రీనింగ్ యంత్రం పనితీరును సోమవారంనాడు పరిశీలిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్