తెలంగాణ

కాల్ చేస్తే కరోనా సందేశం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 9: గత రెండు మూడు రోజుల నుంచి ఎవరి ఫోన్‌కు కాల్ చేసినా రింగ్ కంటే ముందుగానే ఓ పెద్ద దగ్గు శబ్దం వినిపిస్తోంది. తర్వాత దగ్గు ఆగగానే అర్థం కాని భాషలో మాటలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నివారణకు ప్రచారమా? అప్రమత్తంగా ఉండాలంటూ సందేశమా? ఏమో తెలియదు కానీ ఏ ఫోన్‌కైనా కాల్ చేస్తే చాలు ముందుగా దగ్గు శబ్దం, ఆ తరువాత అర్థం కాని భాషలో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికైనా ఫోన్ చేస్తే చాలు ఈ దగ్గు దడేందిరా బాబోయ్ అంటూ జనం తలలు పట్టుకుంటున్నారు. ప్రపంచం అంతా కరోనా వైరస్ ప్రభావంతో ఇదివరకే గజగజ వణికిపోతోంది. అయితే టెలిఫోన్, సెల్‌ఫోన్లలో కరోనా వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఉన్నా, ఎవరికి ఫోన్ చేసినా దగ్గుతో దడ పుట్టిస్తుండగా, అర్థం కాని భాషలో అందిస్తున్న సందేశం అర్థం కాక ఫోన్ వినియోగదారులు సతమతమవుతున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజల చైతన్యపర్చేందుకు చర్యలు తీసుకోవడం మంచిదే అయనా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అర్థమయ్యే భాషలో సందేశాన్ని అందిస్తే ఎంతో కొంత మేలు జరిగేదని, అలా కాకుండా అర్థం కాని భాషలో సందేశం, జాగ్రత్తలు చెబితే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే అవుతుందని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని వినియోగదారులు చర్చించుకుంటుండటం గమనార్హం.