తెలంగాణ

పోలీస్ బందోబస్తు మధ్య మారుతీరావు అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మార్చి 9: పట్టణానికి చెందిన మారుతీరావు అంత్య క్రియలు సోమవారం బంధుమిత్రులు, స్థానికుల ఆశ్రునయనాల మధ్య జరిగాయ. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో కూతురు అమృత భర్త పెరుమాళ్ల ప్రణయ్‌ను సుఫారీ ఇచ్చి హత్య చేయించిన కేసులో ఏ వన్ నిందితుడైన మారుతీరావు హైద్రాబాద్‌లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మారుతీరావు పార్ధివదేహానికి అంత్యక్రియలు సోమవారం పోలీస్ బందోబస్తు నడుమ పట్టణంలోని షాబునగర్‌లోని హిందూశ్మశాన వాటికలో ముగిసాయి. కాగా తిరునగరు మారుతీరావు మృతదేహానికి నివాళులర్పించిన బంధువులు, స్నేహితులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారీగా ప్రజలు తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొని కడసారి మారుతీరావు పార్ధివదేహాన్ని తిలకించి నివాళులర్పించారు. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఆయన పార్ధివదేహాన్ని చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుకున్నారు. మారుతీరావుకు తమ్ముడు శ్రవణ్ తలకొరివి పెట్టారు. కాగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎన్‌బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా కోటేశ్వర్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్‌అలీ, పలువురు కౌన్సిలర్లు, వివిధ పార్టీన నాయకులు, కార్యకర్తలు మారుతీరావు పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా అంతిమయాత్రలో పాల్గొన్నారు.
తండ్రి చివరి చూపు దక్కలే..
గోబ్యాక్ అంటూ బంధువుల నినాదాలు
మిర్యాలగూడ, మార్చి 9: నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో సోమవారం జరిగిన మారుతీరావు అంత్య్రకియల సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ. కన్న తండ్రిని కడసారి చూసేందుకు పోలీసుల భద్రత మధ్య షాబునగర్‌లోని హిందూ శ్మశానవాటిక వద్దకు సోమవారం వెళ్లిన అమృతప్రణయ్‌కు నిరాశ మిగిలింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆదివారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆయన అంత్య్రకియల సందర్భంగా తండ్రిని చూసేందుకు వెళ్లిన అమృతను బంధువులు, స్థానికులు, స్నేహితులు అమతృ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో శ్మశానవాటికలో ఉద్రిక్తత నెలకొంది. ప్రణయ్ కుటుంబసభ్యులతో కలిసి పోలీస్ వాహనంలో వచ్చిన అమృత వాహనం దిగి తండ్రి మారుతీరావు భౌతికకాయం వద్దకు వెళ్తుండగా, అమృతకు వ్యతిరేకంగా బంధువులు, కుటుంబసభ్యులు నినాదాలు చేశారు. తండ్రి మృతికి కారణమైన అమృత గోబ్యాక్... మారుతీరావు అమర్హ్రే అంటూ నినాదాలు చేస్తూ అమృతను అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితి నెలకొనడంతో పోలీసులు అమృతను తిరిగి వాహనం ఎక్కించి తీసుకువెళ్లారు. దీంతో తండ్రిని చివరి చూపు చూడకుండానే అమృత వెనుతిరిగి వెళ్లిపోయారు. తండ్రిని కడసారి చూసే అవకాశం కూడా ఆమెకు దక్కలేదు.

*చిత్రం...తిరునగరు మారుతీరావు పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తదితరులు