తెలంగాణ

7న ప్రధాని మోదీ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గోదావరిఖని, జులై 23: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 7న నగరానికి రానున్నారు. ఒకరోజు పర్యటనలో ప్రధాని మోదీ పలు అధికారిక కార్యక్రమాలతో పాటు బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొంటారు. మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరానప్పటికీ, పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయానికి పర్యటన తేదీని ఖరారు చేస్తూ పిఎంవో సమాచారం అందించింది. ఇటీవల ప్రధాని మోదీని సిఎం కెసిఆర్ కలిసినప్పుడు తెలంగాణకు రావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి సరైన సమయమిదేనని భావిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడులక్ష్మణ్ కూడా ప్రధానిని రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈమేరకు అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ అంగీకరించారు.
కార్యకర్తల సమ్మేళనంలో..
ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షతన శనివారం పార్టీ కార్యాలయంలో పదాదికారులు సమావేశమై విస్తృత ఏర్పాట్లపై చర్చించారు. సమావేశానంతరం పార్టీ నాయకుడు, శాసనసభాపక్షం ఉప నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధాని రాక సందర్భంగా హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇంకా వేదిక ఖరారు కాలేదని, ప్రధాని పర్యటన ఖరారు కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, మోదీ పర్యటనతో పార్టీ మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పర్యటనతో అపరిష్కృతంగా ఉన్న హైకోర్టు విభజన, ఎస్సీ వర్గీకరణ వంటి సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించకున్నా తాము పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా హాజరుకానున్నారని చెప్పారు. పార్టీ పదాదికారుల సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్. ఇంద్రసేనారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
7న రామగుండానికి రాక
ప్రధాని మోదీ కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపిసికి రానున్నారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం పనులతోపాటు రామగుండం ఎరువుల కార్మాగారం పునరుద్ధరణ పనులకు మోదీ శంకుస్థాపన చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రూ.11 వేల కోట్లతో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మాణం చేపడుతున్నారు. 1600 మెగావాట్ల సామర్ధ్యం గల ఈ ప్రాజెక్టును రాష్ట్ర విద్యుత్ అవరసరాల కోసం వినియోగించనున్నారు.