తెలంగాణ

ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మార్చి 9: మారుతీరావు ఆత్మహత్య చేసుకొని మృతి చెందేంత పిరికివాడు కాదని ఆయన కుమార్తె అమృతప్రణయ్ అన్నారు.
సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ శ్రవణ్ వల్లే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. మారుతీరావును శ్రవణ్ కొట్టినట్టు తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. మారుతీరావును తండ్రి అని సంబోధించక పలుమార్లు మారుతీరావు అంటూ అమృత పేర్కొంది. కొంతకాలంగా నాన్నకు బాబాయ్ శ్రవణ్‌కు ఆస్తి గొడవలు జరిగాయని, మారుతీరావు తమ్ముడు శ్రవణ్ అంటే భయపడతాడని ఆమె పేర్కొంది. డబ్బుల విషయంలో సుఫారీ గ్యాంగ్ బెదిరింపులు కూడా ఒక కారణం కావొచ్చని ఆమె తెలిపింది. ‘బాబు పుట్టాక అమ్మనాతో మాట్లాడింది. బాబును చూపించాలని కోరితే నేనే నిరాకరించా. నాన్నకు కోర్టుపరంగా శిక్ష పడాలని కోరుకున్నా. కాని ఆయన ఆత్మహత్య చేసుకోవడం తప్పే. అమ్మ దగ్గరికి వెళ్లలేను. దగ్గరికొస్తే వద్దనుకోను. బాబాయ్ శ్రవణ్‌తో అమ్మకు ప్రాణహాని ఉంది. అమ్మతో వెళ్లమన్న నాన్న కోరిక నెరవేరుస్తా. అలా అని అత్త, మామలను వీడాలంటే ఒప్పుకోను.
తల్లి దగ్గరకు వెళ్లే ప్రసక్తి లేదు.. ఆమె నా దగ్గరకు వస్తే చూసుకుంటా’ అని అమృత అన్నారు. భర్త చనిపోతే కలిగే బాధ ఆమెకు తెలుస్తుందని అమృత వ్యాఖ్యానించింది. మారుతీరావు ఆస్తిపై తనకు ఎలాంటి ఆశ లేదని, అవసరం కూడా లేదన్నారు. నాన్న ఆత్మహత్య చేసుకోవడం కూతురిగా బాధ పడుతున్నానన్నారు. ఆస్తి కోసమే తాను వచ్చానని శ్రవణ్ చెప్పడం సరి కాదంది. తాను వేరే ఉండి అమ్మను, అత్తామామలను చక్కగా చూసుకుంటానని ఆమె పేర్కొంది.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అమృత ప్రణయ్