తెలంగాణ
ఆమెవి తప్పుడు ఆరోపణలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మిర్యాలగూడ, మార్చి 9: మారుతీరావును చనిపోయేవరకు ఉరి తీయాలని డిమాండ్ చేసిన అమృత ఇప్పుడు డబ్బు కోసం డ్రామాలు ఆడుతోందని మృతుడు మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తండ్రి చనిపోతే శుభవార్త అన్న అమృత మారుతీరావు చనిపోయాక ఆయనకున్న ఆస్తిపైన ప్రేమతోనే లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు. నాన్న అని కూడా ఆమెకు మాట రావడం లేదని కన్న కూతురు తండ్రి చనిపోయిన తరువాత కూడా మారుతీరావు అని అమృత సంబోధించడాన్ని బట్టి చూస్తే ఆమెకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. నిన్నమొన్నటివరకు తండ్రి చావాలని కోరుకుందని అలాంటి అమృతకు ఇప్పుడు ఎక్కడ నుండి ప్రేమ పుట్టుకొచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. అమృత చేసిన తప్పిదం వలనే కుటుంబం చిన్నాభిన్నమైందన్నారు. తన వల్ల అమృత తల్లికి ప్రాణాపాయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ప్రణయ్ హత్యకు ముందు మారుతీరావుకు తనకు మాటలు లేవన్నారు. అమృత విషయంలో జరిగిన గొడవల వల్లే మాటలు లేవనే విషయం అందరికీ తెలుసన్నారు. కోర్టు ఎలాంటి శిక్ష విధించినా అనుభవిస్తానని ఆయన అన్నారు. శ్రవణ్ వల్లఅపాయం ఉందంటే దేనికైనా సిద్ధమన్నారు. తండ్రి చనిపోతే శుభవార్త అని అన్న వారు ఇప్పుడు మారుతీరావు పోయాక ఆయన వెనకాల ఉన్న ఆస్తి, డబ్బు కోసమే ఈ డ్రామాలన్నారు. మారుతీరావు ఏం తీసుపోయాడు. నేను ఏం తీసుకుపోతాను.. నేను బెదిరించే వాడిని అయితే నా పేరు ఎందుకు బయటకు రావడం లేదన్నారు. మీడియాలో కనిపించడం కోసం అమృత డ్రామాలు చేస్తోందన్నారు. వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తే తనకేం అభ్యంతరం లేదన్నారు. అన్యాయంగా తనను కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆయన పేర్కొన్నారు. తనను చంపడానికి అసత్య ఆరోపణలను చేస్తోందన్నారు. మారుతీరావు తన వీలునామాను 2018 మార్చిన రాసాడన్నారు. మారుతీరావుకు సంబంధించిన ఒక్క పైసా కూడా తనకు అక్కర్లేదన్నారు. అమృతను మీడియాలో ఎక్కువ చేయొద్దని హెచ్చరించాడు. ఆమెకు మెచ్యూరిటీ లేదని, ఏవేవో మాట్లాడుతోందన్నారు. మారుతీరావు పెళ్లాం మెడలో పుస్తెలతాడు తీస్తేనే తానూ తీస్తానని అప్పట్లో అమృత అన్నదని ఆయన ఆరోపించారు. ఎంతో ప్రేమతో చూసుకునే తండ్రిని కోల్పోవడం ఆమె దురదృష్టకరమన్నారు. ఆమె పట్ల చాలా ప్రేమగా ఉండేవారన్నారు. ఒక్కనాడూ ఒక్క మాట కూడా బిడ్డను దూషించిన సందర్భం లేదన్నారు. ఆర్ధిక లావాదేవీల్లో ఎలాంటి సమస్యలు లేవన్నారు. మారుతీరావు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడానికి తాను సిద్ధమని మారుతీరావు తమ్ముడు శ్రవణ్ తెలిపారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మారుతీరావు తమ్ముడు శ్రవణ్