తెలంగాణ
మనిషిని చంపేస్తారా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 9: పబ్‌లో జరిగిన దాడిలో గాయాల పాలైన బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ మద్దతు పలికారు. ఈ మేరకు ఇద్దరు కలిసి సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను కలిశారు. తనకు న్యాయం చేయాలని రాహుల్ మంత్రి కేటీఆర్‌ను కూడా కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రకాష్‌రాజ్ చీఫ్ విప్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కాంప్రమైజ్ అయ్యేందుకు చీఫ్ విప్‌ను కలవాల్ని అవసరం లేదని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు. అంతేకాక, ఆ దాడిలో రాహుల్ వైపు తప్పేమి లేదన్నారు. సోమవారం పాతబస్తీలోని రాహుల్ సిప్లిగంజ్ ఇంటికి వచ్చిన ప్రకాష్ రాజ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్‌పై దాడి చేయడం పెద్ద తప్పేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాడి చేసిన వాళ్లు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు ఎవరూ లేరనుకోవద్దంటూ తామంతా ఉన్నామని భరోసానిచ్చారు. అంతేకాక, ఆయనకు తన అభిమానులు కూడా ఉన్నారని, వారు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పారు. పబ్‌కు వెళ్లడం తప్పని ఎవరూ అనరు, కాని, ఒకడిని చేసి అలా బీరు సీసాలతో కొట్టడం తప్పు, మనిషిని చంపేస్తారా? అంత అహంకారం పనికిరాదని, రాహుల్‌కు వెనుక నేను నిలబడుతాను, అతనికి ఒక ధైర్యం ఇస్తున్నానని చెప్పారు. రాహుల్ తప్పు చేయలేదని నాకు తెలుసు, సినిమా ఇండస్ట్రీకి చెందిన పాపులర్ పర్సన్స్‌ని కొడతారా? ఈ విషయంలో పోలీస్ కమిషనర్‌ను కూడా కలువనున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.
ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో రాహుల్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.