తెలంగాణ

టీఆర్‌ఎస్ అక్రమాలకు చెక్ పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: టీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమాలకు చెక్‌పెడాతామని, బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే కుట్రతో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం దోపిడీకి పాల్పడితే వాచ్‌డాగ్‌లా వ్యవహరిస్తామన్నారు. తమకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజా వాణిని అసెంబ్లీ వేదికగా వినిపించి తీరుతామన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ప్రశ్నిస్తే భరించలేని స్థితికి అధికార పక్షం చేరుకుందన్నారు. టీఆర్‌ఎస్ మంత్రులు కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు.
బీసీలు, మైనారిటీల, దళితులకు సర్కార్ ఏమి చేసింది: షబ్బీర్ అలీ
దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలకు ఉన్నత విద్యకు తగినన్ని నిధులు బడ్జెట్‌లో కేటాయించలేదని, ఈ వర్గాలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ కేటాయింపులు తగ్గించడం వల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఉత్తుత్తివేనన్నారు. రకరకాల విద్యా కోర్సులకు ఈ వర్గాలకు గత ఏడాది బడ్జెట్‌లో రూ.890.61 కోట్లు కేటాయించగా, 2020-21లో రూ.400 కోట్లకు తగ్గించారన్నారు. ప్రి మెట్రిక్ ఉపకారవేతనాలు, తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం, మైనారిటీలకు విదేశీ విద్య అభ్యసించేందుకు సాయం, రాష్ట్ర మైనారిటీల గురుకుల పాఠశాలలు, హాస్టళ్లకు నిధులు తగ్గించారన్నారు. మైనారిటీ గురుకుల విద్యా సంస్థలకు బడ్జెట్‌ను రూ.483.95 కోట్ల నుంచి రూ.212.98 కోట్లకు తగ్గించారన్నారు.