తెలంగాణ

కరోనా.. ట్రీట్‌మెంట్ కరేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సికిందరాబాద్, మార్చి 10: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అనేక దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్ (కరోనా) వ్యాధిని నగరంలోని గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేశారు. రాష్ట్రంలో నిర్ధారణ అయిన ఒకే ఒక్క కేసుకు అధునాతనమైన చికిత్సను అందించి గాంధీ వైద్యులు తమ వృత్తి నైపుణ్యం చాటుకున్నారు. దీంతో నగరంలో ఇక కరోనా వైరస్ లేనట్టేనని చెప్పవచ్చు. ఈ పరిణామంతో సిటీలో కరోనా భయం కొంత వరకు తగ్గుముఖం పట్టే అవకాశముంది. కొద్దిరోజుల క్రితం దుబాయి నుంచి బెంగుళూరుకు, అక్కడి నుంచి బస్సులో నగరానికి వచ్చిన మహేంద్రహిల్స్ రవి కాలనీకి చెందిన ఓ యువకుడికి ఈ వైరస్ నిర్దారణ అయిన సంగతి తెలిసిందే! అప్పటి నుంచి బాధితుడిని ప్రత్యేక ఐసొలేషన్ గదిలో ఉంచి చికిత్సను అందించిన వైద్యులు తరుచూ రక్తపరీక్షలు చేస్తూ, అందుకు అవసరమైన చికిత్సను అందించారు. తాజాగా మంగళవారం చేసిన పరీక్షల్లో ఆ యువకుడికి కరోనా వైరస్ లేనట్టు తేలింది. జ్వరం, రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు జలుబు కూడా పూర్తిగా తగ్గినట్లు వైద్యులు నిర్దారించారు. బాధితుడి ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చిందని, కరోనా నుంచి అతను కోలుకున్నట్టేనని గాంధీ ఆసుపత్రి వైద్యులు భావిస్తున్నారు. కానీ ఈ విషయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో బాధితుడిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపే అవకాశముంది. అంతేగాక, చివరిసారిగా పూణేలోని వైరాలజీ ల్యాబ్ నిపుణుల అభిప్రాయం తీసుకునేందుకు శ్యాంపిల్స్‌ను పంపనున్నారు. డిశ్చార్జి అయిన తర్వాత బాధితుడు ఇంట్లో ఓ ప్రత్యేక గదిలోనే ఉండాలని, ఎవర్నీ కలవరాదని 14 రోజుల పాటు పలు జాగ్రత్తలు సూచించి ఇంటి పంపాలని భావిస్తున్నారు. గాంధీలో చేరకముందు బాధితుడు ఐదు రోజుల పాటు తమ కుటుంబ సభ్యులతో గడిపినా, వారిలో ఏ ఒక్కరిలోనూ లక్షణాలు కన్పించకపోవటం, పైగా వారికి వైరస్ సోకలేదని తమ పరీక్షల్లో తేలటంతో ఇక నగరంలో కరోనా వైరస్ లేనట్టేనని వైద్యులు భావిస్తున్నారు. నగరంలో ఉన్న ఒక్క కేసు కూడా నయం కావటంతో క్రమంగా కరోనా భయం తగ్గే అవకాశముంది.
తగ్గిన వైరస్.. పెరగని రోగులు
కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ నిన్న మొన్నటి వరకు గాంధీ ఆసుపత్రికి లైన్ కట్టిన రోగుల సంఖ్య మంగళవారం బాగా పడిపోయింది. కరోనా భయంతో సాధారణ అనారోగ్యంతో వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య ప్రతిరోజు దాదాపు రెండు వేల వరకు ఉండగా, ఇపుడు వంద కూడా దాటడం లేదు. కరోనా అనుమానితుల సంఖ్య కూడా ఐదుకు పడిపోయింది. మంగళవారం కరోనా అనుమానిత లక్షణాలతో కేవలం ఐదుగురు ఆసుపత్రికి వచ్చారు. వీరిలోనూ ట్రావెల్ హిస్టరీ లేని వారికి వైద్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ అనారోగ్య లక్షణాలే అయి ఉండవచ్చునని కౌనె్సలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు.