తెలంగాణ

మెట్రో ప్రాజెక్టు సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: హైదరాబాద్‌లో మెట్రోరైల్ విజయవంతమైన ప్రాజెక్టు అని, ప్రపంచంలోనే అగ్రశ్రేణి మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటిగా స్థానం సంపాదించిందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాగంటి గోపీనాథ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ప్రతిరోజూ మెట్రో రైలులో దాదాపు 4 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ మెట్రో రైలును విస్తరించి ప్రతిపాదన ఉందన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయం వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో కారిడార్ కోసం సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పరిశీలనలో ఉందన్నారు. దీని అమలుకు షెడ్యూలుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇక హైదరాబాద్ పాతబస్తీలో ఎంజీబీఎస్, ఫలక్‌నుమా కారిడార్‌ను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. పాతనగరంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5 కి.మీ మేర కారిడార్-2 పను ల నిర్వహణ కోసం చేపట్టినట్లు ఆయన చెప్పారు. మిగిలిన ఫేజ్-1 ప్రాజెక్టు పనులను పూర్తి చేపట్టినట్లు చెప్పారు. పాతనగరంలో ఐదు కి.మీ మెట్రో రూట్ లో 93 మతపరమైన సమస్యాత్మకమైన కట్టడాలు ఉన్నాయన్నారు. వీటిలో దాదాపు 18 రోడ్ల విస్తరణ వల్ల మెట్రో ఎలైన్‌మెంట్ వల్ల ప్రభావితమవుతాయన్నారు. ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా ఈ కట్టడాలన్నింటినీ రక్షించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.
*చిత్రం... ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్