తెలంగాణ

అంగరంగ వైభోవంగా శివ కల్యాణోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 11 : సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం శివకల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయ. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమన్న ఆధ్వర్యంలో ఉదయం శివభగవత్సుణ్యాహవాచనము, పంచగవ్య మిశ్రణము, దీక్షాధారణము, ఋత్విక్‌వరణము, మంటప ప్రతిష్ఠ, గౌరీ షోడశమాతృకా ప్రతిష్ట, నవ గ్రహ ప్రతిష్ఠ, వాస్తు ప్రతిష్ఠ, మృత్సంగ్రహణము, అంకురార్పణం, సోమకుంభ కలశ ప్రతిష్ఠ, వాస్తు హోమం, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామివారికి మహన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, వేద పారాయణాలు, పరివార దేవతార్చనలు జరిగాయి, సాయంత్రం 4 గంటలకు శ్రీ శివపురాణ ప్రవచనం, రాత్రి భేరిపూజ, దేవతాహ్వానము, నీరాజనం, తీర్థప్రసాద వితరణలు చేశారు. ఆలయ ఇవో కృష్ణవేణి స్వామివారలకు పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారల దివ్య కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అభిజిత్ లగ్న సుముహూర్తమున కల్యాణ తంతును వేదపండితులు శాస్రోక్తంగా ఘనంగా నిర్వహిస్తారు.

*చిత్రాలు.. శివకల్యాణోత్సల సందర్భంగా సోమకుండ కలశ ప్రతిష్ఠ చేస్తున్న చేస్తున్న వేదపండితులు
* అర్చక దంపతులకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఆలయ ఈవో కృష్ణవేణి
* యాగశాలలో ప్రతిష్ఠించిన ఉత్సమూర్తులు