తెలంగాణ

బిచ్చం కాదు.. రాజ్యాంగ హితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు బిచ్చం కాదని, రాజ్యాంగ హితమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు టీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రం పాలనలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ అట్టర్‌ఫ్లాప్ అయ్యాయని సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకాలతో బీజేపీ వాళ్లు ఉద్ధరిస్తారని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ఈ దేశం అందరిదీనని, పన్నుల వసూలుకు ఒక మార్గనిర్దేశానికి చట్టాన్ని పెట్టుకున్నారని, దాని ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలని అన్నారు. ప్రతిసారీ కేంద్రం సెంట్రల్ డివల్యూషన్ పేరిట తామేదో
ఇస్తున్నట్టు చెప్పుకుంటుందని, వాస్తవానికి ఇది సెంట్రల్ డివల్యూషన్ కాదని, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాకు ఆ పేరు పెట్టారని చెప్పారు. పన్నులు వసూలు చేసిన తర్వాత కేంద్రం రెండు రకాలుగా నిధులు ఇస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. ఒకటి జీఎస్‌టీ ద్వారా పన్నుల వాటా, రెండోది కేంద్ర- రాష్ట్ర జాబితాలోని శాఖలకు సంబంధించి కేంద్రం వాటా, కేంద్ర జాబితాలోని శాఖలకు అందించే నిధులు ఉంటాయని ఇందులో కొత్తగా కేంద్రం ఇచ్చేది ఉండదని అన్నారు. జీఎస్‌టీ వల్ల ఎంతో ప్రయోజనం అని చెప్పారని, వేల కోట్లు ఎగ్గొట్టారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీఎస్‌టీని అమలు చేసిందని, ఆ పద్దు కింద నిధులు రావడం లేదని చెబితే చట్టం చేస్తామని బీజేపీ ప్రభుత్వం జీఎస్‌టీ తెచ్చిందని చెప్పారు. భారతదేశ చరిత్రలో కేంద్రంపై నమ్మకం పెట్టుకుంటే శంకరగిరిమాన్యాలేనని సీఎం వ్యాఖ్యానించారు. సెంట్రల్ డివల్యూషన్ కింద రాష్ట్ర వాటా 3900 కోట్లు రావాలని అన్నారు. ఈ మేరకు కమిట్‌మెంట్ ఇచ్చినా, ఆ నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. అది ఇవ్వకపోగా 1200 కోట్లు అప్పు తెచ్చుకోమని తిరిగి కేంద్రం సూచించిందని అన్నారు. ఇది ఏ ప్రభుత్వమైనా ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇంత వరకూ ఎన్నో మార్లు మొరపెట్టుకుంటే కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చింది కేవలం 10వేల కోట్లు మాత్రమేనని, దానికి ఎన్నో తిప్పలుంటాయని, యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు ఇస్తే , వారి చుట్టూ తిరిగితే ఆ డబ్బు వస్తుందని, ఆనాడు దేశాన్ని భ్రమింపచేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తే నేడు బీజేపీ దానికి తాత అయిపోయిందని అన్నారు. దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని, మనం పన్నుల రూపంలో కేంద్రానికి 50వేల కోట్లు ఇస్తుంటే తిరిగి కేంద్రం మన వాటా కింద 24వేల కోట్లే ఇస్తోందని, జరుగుతున్నదంతా ప్రజలకు తెలుసని, ఇది చదువురాని రాష్ట్రం కాదని, బీజేపీ నీఛ బుద్ధి మానుకోవాలని అన్నారు.