తెలంగాణ

ఎంపీ అభ్యర్థుల ఖరారుతో ఎమ్మెల్సీలకు పెరిగిన పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో ఉత్కంఠ వీడటంతో ఈ సీటు కోసం పోటీ పడిన నేతలు తమకు కనీసం ఎమ్మెల్సీగానైనా అవకాశం ఉంటుందేమోనని ఆశిస్తున్నారు. అయితే, రాజ్యసభ సీటుకు పోటీపడిన మాజీ ఎంపీలు ఎవరూ ఎమ్మెల్సీ స్థానంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని తెలిసింది. దీంతో మిగతా నాయకులు మాత్రం ఎమ్మెల్సీతో సర్దిపెట్టుకోవడానికి కూడా
సిద్థంగా ఉన్నట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డికి రాజ్యసభకు అవకాశం లభించడంతో ఆ జిల్లా నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు అక్కడి నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించవచ్చని పార్టీ వర్గాలు అంచన వేస్తున్నాయి. అయితే, ఎమ్మెల్సీకి కవిత ఒప్పుకుంటుందా? అనేది అనుమానమే. కాగా, అక్కడి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ప్రస్తుతానికి సస్పెనే్స. ఇలా ఉండగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం సీఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, గ్యాదరి రాజమల్లు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్‌కుమార్‌రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు దేశపతి పేరు ఖరారు అయినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ రాజ్యసభ అభ్యర్థి ఎంపిక మాదిరిగా చివరి నిమిషంలో మరేవ్వరికైనా అవకాశం ఉంటుందేమోనన్న అనుమానం లేకపోలేదు.