తెలంగాణ

రాజ్యసభకు కేకే, కేఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: రాజ్యసభ అభ్యర్థుల ఉత్కంఠ వీడింది. టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుకు తిరిగి అవకాశం కల్పించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ కేఆర్
సురేష్ రెడ్డిని అభ్యర్థులుగా ఎంపిక చేసినట్టు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో వీరిద్దరు నామినేషన్లు దాఖలు చేస్తారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్థానాలు గెలుచుకోవడానికి పాలకపక్షం టీఆర్‌ఎస్‌కు పూర్తి బలం ఉండంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం, లాంఛనప్రాయమే. రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన కేశవరావు, కేఆర్ సురేశ్‌రెడ్డిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతిభవన్‌కు పిలిపించుకొని గురువారం సాయంత్రం బి-్ఫమ్‌లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తమను అభ్యర్థులుగా ఎంపిక చేయడం పట్ల వారిద్దరు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఉండగా, రాజ్యసభ సభ్యుడు కేశవరావు పదవీ కాలం ముగియనుండటంతో తిరిగి ఆయనకు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు ముందు నుంచి అంచనా వేశాయి. కాగా, మరో అభ్యర్థి ఎవరన్నది రెండు వారాల నుంచి టీఆర్‌ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్, సీతారామ్ నాయక్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీఎం సన్నిహితుడు ధికొండ దామోదర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధికొండ దామోదర్‌రావు వీరిద్దరిలోనే ఒకరికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. అయితే, గురువారం మధ్యాహ్నం శాసనసభకు వచ్చిన సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా నాయకులతో రాజ్యసభకు రెండో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా కేఆర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఉన్నతమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేసినట్టు తెలిసింది. సీఎం స్వయంగా కేఆర్ సురేష్ రెడ్డి పేరు ప్రతిపాదించడంతో అక్కడున్న నాయకులు ఎవరూ మారు మాట్లాడలేదని తెలిసింది. దీంతో ఆ వెంటనే రాజ్యసభ అభ్యర్థులుగా కేశవరావు, సురేశ్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే వారిద్దరికి సీఎం కేసీఆర్ బి- ఫామ్‌లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

*చిత్రం...రాజ్యసభ అభ్యర్థులుగా బీ- ఫామ్ అందజేసిన అనంతరం కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డితో
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు