తెలంగాణ

హామీల అమలు వల్లే కేసీఆర్‌కు బ్రహ్మరథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయడం వల్లనే రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని ఆర్థిక మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
శాసనసభకు 2020-21 సంవత్సరానికి ప్రభుత్వం సమర్పించిన వార్షిక బడ్జెట్‌పై జరిగిన చర్చకు గురువారం జవాబు ఇస్తూ, బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులు తక్కువగా ఉంటాయని కాంగ్రెస్ భావించిందన్నారు. బడ్జెట్‌ను చూసిన ప్రజలు ఆనందంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు మాత్రం నిరాశకు గురయ్యారన్నారు. మానవీయ కోణంలో బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థికమంత్రి తెలిపారు. సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని స్పష్టం చేశారు. 40 లక్షల మందికి ఆసరా ఇచ్చేందుకు గత ఏడాదికన్నా రెండువేలకోట్ల రూపాయలు అధికం చేస్తూ 11 వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించామని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను కాంగ్రెస్ తమ హయాంలో ఎందుకు చేపట్టలేదని హరీష్‌రావుప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. గోదావరి రివర్ ఫ్రంట్‌కు అవసరమైన నిధులు ఇచ్చామన్నారు. 2004-14 మధ్య కాలంలో కాంగ్రెస్ హయాంలో వివిధ రంగాలకు కేటాయించిన నిధులతో పోలిస్తే, టీఆర్‌ఎస్ హయాంలో 2014 నుండి ఇప్పటి వరకు చేసిన ఖర్చు మూడు, నాలుగురెట్లు అధికంగా ఉందన్నారు. నీటిపారుదల రంగాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో విజయడైరీ నిర్వీర్యం కాగా, తాము దీన్ని కాపాడి, లాభాల దిశలో నడిపిస్తున్నామన్నారు.
విద్యుత్ సరఫరా గతంలో సరిగ్గా లేకపోవడం వల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, చాలా వరకు సగం సగం ఉత్పత్తులతో కొనసాగాయని గుర్తు చేశారు. నేడు పరిశ్రమలకు కోత లేకుండా నాణ్యమైన విద్యుత్తును ఇవ్వడం వల్ల పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన నీలం తుపాను వల్ల నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 480 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. నేడు పంటల పరిస్థితి చాలామెరుగైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు కేటాయించామని తెలిపారు.
నియమావళికి అనుగుణంగానే అప్పులు తీసుకున్నామని హరీశ్‌రావు తెలిపారు. పార్లమెంట్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం చెబుతూ, అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను ప్రశంసించారన్నారని గుర్తు చేశారు. దేశంలోని 19 రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎంను అతిక్రమించి అప్పులు చేశాయని పేర్కొన్నారు. దుబారా ఖర్చును తగ్గించుకోవడం, అంతర్గత వనరులను పెంచుకోవడం, నిరర్ధక ఆస్తులను అమ్మివేయడం తదితర చర్యల ద్వారా ద్రవ్యలోటును పూడ్చుకుంటామన్నారు. జిల్లాలను పెంచవద్దని, ప్రాజెక్టులను కట్టవద్దని, మిషన్ భగీరథ వద్దని, మిషన్ కాకతీయ వద్దని..ఇలా అన్నింటినీ వద్దనే కాంగ్రెస్ పార్టీని ‘వద్దుల పార్టీ’గా హరీష్‌రావు అభివర్ణించారు. ఈ కారణంగానే రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయిందన్నారు.