తెలంగాణ

కేసీఆర్ ప్రభుత్వం తప్పు ఒప్పుకోదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: కేసీఆర్ హయాంలో పరిపాలనకు సంబంధించి అనేక పొరపాట్లు, తప్పులు జరుగుతూ ఉన్నప్పటికీ, వాటిని ఒప్పుకునేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు ఆరోపించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో పాల్గొంటూ, ప్రతిపక్షంగా బాధ్యతగా ఉంటున్న తమ పార్టీ సూచించిన సూచనలను కూడా కేసీఆర్ ప్రభుత్వం వినే పరిస్థితిలో లేరన్నారు. ఆర్థిక మాంద్యం ఉందంటూ, కేంద్రం నుండి అవసరమైన నిధులు రావడం లేదంటూనే 2019-20 సంవత్సరం కన్నా 2020-12 బడ్జెట్‌లో 25-27 శాతం పెరుగుదల ఉండటాన్ని ప్రస్తావించారు. బడ్జెట్‌లో వెల్లడించిన అంశాలకన్నా దాచిపెట్టిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి (బడ్జెట్ కన్సీల్స్ మోర్ దేన్ ఇట్ రివీల్స్) అన్నారు. గత ఆరు సంవత్సరాల నుండి ప్రభుత్వం ప్రతిపాదించిన నిధులతో పోలిస్తే, వాస్తవంగా ఖర్చు చేసిన నిధులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. 2014-15 నుండి సంవత్సరాల వారీగా లెక్కలను ప్రస్తావించారు. రెవెన్యూ ఖర్చు కూడా బడ్జెట్ ప్రతిపాదనలకన్నా తక్కువగా ఉందని విమర్శించారు. నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్‌లో గత ఏడాదికన్నా నిధులు తగ్గించారని గుర్తు చేశారు. విద్యుత్ సంస్థలకు (డిస్కాంలకు) 20 వేల కోట్ల రూపాయలు బకాయిలుగా ప్రభుత్వం చెల్లించాలని, ఈ నిధులు చెల్లిస్తే, విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసర లేదన్నారు.
ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని, విశ్వవిద్యాలయాలకు వైస్-్ఛన్సలర్లను కూడా నియమించడం లేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 700 కోట్ల రూపాయలు అవసరం కాగా, 343 కోట్ల రూపాయలే కేటాయించారని, ఇతర విశ్వవిద్యాలయాల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. ఎయిడెడ్ కాలేజీల సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాల్సి ఉందన్నారు. విద్యారంగానికి తెలంగాణ రాష్ట్రం 7 శాతం నిధులు కేటాయిస్తే, ఢిల్లీ ప్రభుత్వం 26 శాతం కేటాయించిందని గుర్తు చేశారు. మానవవనరుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. సంక్షేమం పేరుతో ఇస్తున్న పింఛన్ ఒక్కో కుటుంబానికి ఏడాదికి 36 వేల రూపాయలైతే మద్యం ద్వారా ఒక్కో కుటుంబం నుండి సరాసరిన 70 వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఆర్టీసీకి ఇచ్చే 1000 కోట్ల రూపాయలు గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా విడుదల చేయాలని శ్రీధర్‌బాబు సూచించారు. టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా యువతకు నిరుద్యోగభృతి ఇస్తామని ఇవ్వడంలేదని, గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయడం లేదని, రైతుబంధులో స్పష్టత లేదని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లకు నాలుగేళ్లనుండి నిధులు ఇవ్వడం లేదన్నారు. ద్రవ్యవినిమియ బిల్లులో ఈ సవరణలు చేయాలని ఆయన కోరారు.