తెలంగాణ

చలో ఢిల్లీ పెట్టండి-వెళ్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టుకునేందుకు ‘్ఛలో ఢిల్లీ’ కార్యక్రమం పెడితే, సహకరిస్తామని బిజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో పాల్గొంటూ, ప్రధానమంత్రి మాతృవందనం పేరుతో మన రాష్ట్రానికి ఇచ్చిన 75 కోట్ల రూపాయలను కేసీఆర్ కిట్స్ కార్యక్రమానికి వాడుతున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని గుర్తు చేశారు. ఉస్మానియా దవాఖానాకు 200 కోట్ల రూపాయలు ఇస్తానని 2015 లో కేసీఆర్ ప్రకటించి నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి, అమలు చేయడం మరిచారని ఆరోపించారు. వివిధ బ్యాంకుల ద్వారా తీసుకువచ్చిన రుణాల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశకు తన వాటా నిధులను విడుదల చేయకపోవడం వల్ల ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతను కేసీఆర్ ఇస్తూ, ఆ నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయిస్తూ, ఇతర నియోజవర్గాలను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రస్తావిస్తూ, కేసీఆర్ గజ్వేల్‌కే ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ, మాడల్ స్కూళ్లను ప్రారంభించాలని సూచించారు. బడ్జెట్‌లో పేర్కొన్న 33 వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటును ఏ విధంగా భర్తీచేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.