తెలంగాణ

ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వాసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, ఎం సంజయ్, డాక్టర్ అనంద్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, రాష్ట్రంలో ఇంతవరకు 22 ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను నెలకొల్పినట్లు చెప్పారు. ఆరు ఐసీయూలను రూ.14.40 కోట్లతో తృతీయ శ్రేణి సంరక్షణ ఆసుపత్రుల్లో, రూ.26.72 కోట్లతో ద్వితీయ శ్రేణి సంరక్షణ ఆసుపత్రుల్లో 16 ఐసీయూలను నెలకొల్పినట్లు చెప్పారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో తీవ్ర మైన అనారోగ్యంతో చేరిన వారికి ఐసీయూలో రోజుకు రూ.30వేల నుంచి రూ.1 లక్ష మేర వైద్య ఖర్చులు వసూలు చేసినట్లు చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 45 డయాలసిస్ కేంద్రదాలు పని చేస్తున్నయని, 20 డయాలసిస్ కేంద్రాలను, తెలంగాణ వైద్య విధాన పరిషత్ నియంత్రణ కింద జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పీపీపీ విధానం కింద డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ కింద ప్యాకేజీలో నిధులు సమకూర్చినట్లు చెప్పారు.