తెలంగాణ

సాదాబైనామాలకు త్వరలో కొత్తచట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో ఇంకా సాదాబైనామాలకు రెవెన్యూ రికార్డులు అందలేదని, వీటి కోసం త్వరలో రెవెన్యూ కొత్తచట్టాలను తీసుకురావడానికి ప్రభుత్వం సమాలోచన చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ పద్దుల అంశాలపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సాదాబైనామాలతో ఇంకా పట్టాదార్ పాస్ పుస్తకాలు రాకపోవడంతో భూ యజమానులు ఆందోళన చెందుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన అంశాలపై కొత్తచట్టాలను తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం దాదాపు 74 పౌర సేవలను అందిస్తోందన్నారు. వివాదాస్పద భూములను పరిశీలించడానికి దాదాపు 1280 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. 2014లో 7.35 లక్షలు, 2020లో 15 లక్షల ఎకరాలకు రికార్డులను రూపొందించామన్నారు. రాష్ట్రంలో‘టీ’ యాక్ట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.