జాతీయ వార్తలు

ఈస్టుకోస్టు రైలులో చిన్నపిల్లల తరలింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 23: హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ రైలులో చిన్నపిల్లల తరలింపు కలకలం రేపింది. శనివారం ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌లో ఒరిస్సా నుంచి 78 మంది చిన్నపిల్లలను తరలిస్తున్నారంటూ ఇక్కడికి సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకొనేలోపే సివిల్, జిఆర్‌పి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైల్లో ఉన్న చిన్న పిల్లలను, వారిని తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని విచారించగా పిల్లలకు ఖురాన్ కంఠస్థం, ప్రార్థనలు నేర్పేందుకే తీసుకెళ్తున్నట్లు ఒరిస్సా నుంచి నిజామాబాద్ జిల్లా మదర్‌స్సాకు తీసుకెళ్తున్నామని వారు చెప్పారని వరంగల్ షీటీమ్స్ ఇన్స్‌పెక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. వారికి సంబంధించిన గుర్తింపు కార్డులను, పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, అప్పటివరకు ఈ పిల్లలందర్నీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తున్నట్లు అమె వెల్లడించారు.