తెలంగాణ

కొత్తగా 1200 చెక్‌డ్యామ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో కొత్తగా 1200 చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నట్టు ఆర్ధిక మంత్రి హరీష్‌రావు చెప్పారు. శనివారం నాడు శాసనసభలో గండ్ర వెంకటరమణా రెడ్డి, రవి శంకర్ సుంకే, సతీష్‌కుమార్ ఓడితెల, గువ్వల బాలరాజు తదితరులు అడిగిన ప్రశ్నలకు హరీష్‌రావు సమాధానం చెబుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 146 చెక్ డ్యామ్‌లను మంజూరు చేశామని అన్నారు. అందులో 53 చెక్‌డ్యామ్‌లను పూర్తి చేశామని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని అన్నారు. 56,776 ఎకరాల ఆయకట్టుకు సాగు కోసం ప్రతిపాదించామని తెలిపారు. 3825 కోట్ల రూపాయిల అంచనా వ్యయంతో భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతంలోని ప్రవాహాలపై 4వ ఆర్డర్ నుండి 8వ ఆర్డర్ వరకూ 1200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం పరిపాలనా ఆమోదాన్ని ఇచ్చామని తెలిపారు. ఇదంతా నిరంతరం కొనసాగే ప్రక్రియ కనుక మిగిలిన నియోజకవర్గాల్లోనూ రానున్న రోజుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ఇదిలావుండగా, కేసీఆర్ కిట్ పథకం కింద ఫిబ్రవరి చివరి వరకూ 6,47,823 మందికి ప్రయోజనం చేకూరిందని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 826.50 కోట్లు మొత్తాన్ని ఇందుకు ఖర్చు చేశామని అన్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించినపుడు , ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ఇపుడు అది 51 శాతానికి పెరిగిందని అన్నారు.
రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల వారి కోసం 22 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించామని ఎస్టీ సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
రమావత్ రవీంద్ర కుమార్, హరిప్రియ బానోత్, బాపూరావు రాథోడ్‌లు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ రాష్ట్రంలో 22 గురుకుల డిగ్రీ కాలేజీలు ప్రారంభించామని అందులో 15 మహిళలకు, ఏడు పురుషులకు కేటాయించామని చెప్పారు. ఇపుడు వాటిలో విద్యార్థుల సంఖ్య 7835కు పెరిగిందని చెప్పారు. 2018-19లో 41.77 కోట్లు వ్యయం చేశామని, ఈ ఏడాది మార్చి 1 వరకూ 44.06 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు.
డెంగ్యూతో మరణించింది ఏడుగురే
హైదరాబాద్ నగరంలో డెంగ్యూ జ్వరం కారణంగా ఏడుగురు వ్యక్తులే మరణించారని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. జీహెచ్‌ఎంసీలో 350 బస్తీ దనాఖానాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. వీటిలో 122 బస్తీ దవాఖానాలు ఇప్పటికే పనిచేస్తున్నాయని , హైదరాబాద్‌లో 70, మేడ్చెల్‌లో 28, రంగారెడ్డిలో 24 పనిచేస్తున్నాయని చెప్పారు.
జూనియర్ కాలేజీలకు సొంత భవనాలు
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉండగా అందులో 391 కాలేజీలు సొంత భవనాల్లో పనిచేస్తున్నాయని మిగిలిన వాటికి సొంత భవనాలను నిర్మించనున్నామని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గద్వాల్‌లో ఒకటి, హైదరాబాద్‌లో మూడు, మెదక్‌లో మూడు, మెడ్చెల్‌లో ఒకటి, నిర్మల్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒకటి, సంగారెడ్డిలో రెండు , వరంగల్‌లో ఒకటి అద్దె భవనాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
*చిత్రం... శాసనసభలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి హరీష్‌రావు