తెలంగాణ

కరోనాపై దుష్ప్రచారం చేస్తే జైలుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: సోషల్ మీడియాలో కరోనా పోస్టులు, స్టేటస్‌లపై తెలంగాణ పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. లేనిపోని పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. కోరోనాపై దుష్ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తామని సీపీ చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా తొలి కరోనా కేసు నమోదు కావడం, కర్నాటకకు చెందిన వ్యక్తి గాంధీ అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. దీనిపై శనివారం కేబినెట్ బేటీ నిర్వహించి పలు కీలక నీర్ణయాలు తీసుకుంది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, సినిమా హాల్స్, పార్కులు, జూపార్క్ బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పోలీసు శాఖ కూడా అప్రమత్తమయ్యింది. పొద్దున లేస్తే కరోనాకు సంబంధించిన అనేక రకాల మెసేజ్‌లతో ప్రతి ఒక్కరి ఫోన్లు, వాట్సప్‌లు నిండిపోతున్నాయి. కరోనాకు సంబంధించి అనేకమంది రకరకాల మెసేజ్‌లు పెడుతున్నారు. కరోనా వైరస్‌పై లేనిపోనివి దుష్ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, కరోనాపై సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించి, దుష్ప్రచారం చేస్తే జాతీయ విపత్త నిర్వహణ మండలి చట్టం 5.1 ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. కరోనాపై తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తే, సమాజానికి చెడు జరుగుతుందన్నారు. వదంతులు వ్యాపిస్తే ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశాలున్నాయాన్నారు. అందుకే అలాంటి వారిపై చట్టపరమై చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలిపారు. మరోవైపు రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రకృతి విపత్తు నిధి నుంచి ఖర్చు చేయాలంటూ అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా మృతులకు నాలుగు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మేరకు వైద్య ఖర్చులు చెల్లించడానికి ముందుగా కేంద్రం అనుమతించింది. కానీ ఆ తర్వాత ఆ రెండింటిని తొలగిస్తూ మరో అదేశం జారీ చేసింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని మిగతా వారితో కలవనీయకుండా 30 రోజుల పాటు ఆహారం, వస్త్రాలు, వైద్య సేవలు అందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు వాడుకోవాలని సూచించింది.