తెలంగాణ

నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం నాలుగు బిల్లులను ఆమోదించింది. తెలంగాణ వస్తువులు సేవల పన్ను సవరణ బిల్లు, తెలంగాణ మహిళ స్వయం సహాయక బృందాల సహ వాటా పించన్ రద్దు బిల్లు, తెలంగాణ లోకాయుక్త సవరణ బిల్లు, తెలంగాణ జీతాలు, పించను చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్రం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తూ ముఖ్యమంత్రి తరఫున శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.