తెలంగాణ

‘మిషన్ హైదరాబాద్’కు 50 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: ‘మిషన్ హైదరాబాద్’ పేరుతో హైదరాబాద్ నగర అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ది మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శాసనసభలో పురపాలక, పట్టణాభివృద్ధి పద్దులపై జరిగిన చర్చకు ఆదివారం సమాధానం చెబుతూ, హైదరాబాద్ నగరాభివృద్ధికి ఈ ఏడు 10 వేల కోట్ల రూపాయలు కేటాయించామని, ఆ తర్వాత నాలుగేళ్లలో మరో 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. 2020-21 బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు 12,282 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో జనాభా ప్రస్తుతం 44 శాతానికి చేరిందని కేటీఆర్ తెలిపారు. పట్టణ ప్రగతి పేరుతో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రజల అవసరాలను తెలుసుకున్నామన్నారు. హరితహారం, తాగునీరు, పారిశుద్ద్యం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నామన్నారు. హైదరాబాద్ నగరం శాంతి, భద్రతల కోణంలో సేఫ్ జోన్‌గా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
*చిత్రం... అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రకటన