తెలంగాణ

ఎన్‌పీఆర్‌లో నిబంధనలు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: పౌరసత్వ సవరణ చట్టం, తదనంతరం ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్‌ల అమలుకు సంబంధించి దారుణమైన నిబంధనలు ఉన్నాయని, ఎట్టిపరిస్థితిల్లో వాటిని అంగీకరించేది లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. సోమవారం నాడు సీఏఏపై సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ సీఏఏతో ముస్లింలకు తీవ్రమైన ముప్పు ఉందని పేర్కొన్నారు. సీఏఏను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పారు. ఎన్‌పీఆర్ నమోదులో భాగంగా భార్యా భర్తల సర్ట్ఫికేట్లు పరిశీలించాలని ఉందని, అవి లేకుంటే వారి వివాహ సర్ట్ఫికేట్లు చూడాలని, అది కూడా లేదంటే వారి తొలి సంగమం ఎపుడు జరిగిందో చూసి దానిని అనుసరించి వారి పిల్లల వయస్సును నిర్ధారించాలనే నిబంధనలున్నాయని, అంటే ఇళ్లకు వచ్చి భార్యాభర్తలను మీరు తొలిసారి ఎపుడు సంగమించారని వారు ప్రశ్నిస్తారా ఇదేం చట్టం అంటూ అక్బరుద్దీన్ మండిపడ్డారు. ఈ చట్టం అనైతికమని, అనుసరణీయం కాదని పేర్కొన్నారు. అస్సాంలో దీనిని ప్రయోగాత్మకంగా నిర్వహించినపుడు ఒకే కుటుంబంలో కొంత మందికి గుర్తింపు వచ్చింది, అదే కుటుంబంలో మరికొంత మందికి గుర్తింపు రాలేదని , ఈ చట్టంలో ఒక సారి మనం మన జాతీయతను రుజువు చేసుకోలేకపోతే చివరికి విదేశీయులుగా కూడా గుర్తింపు దక్కదని, ఫలితంగా ఫారెన్ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించే అవకాశం కూడా ఉండదని అన్నారు. తెలంగాణలో 83 లక్షల కుటుంబాలుంటే అందులో 40 శాతం మందికి సొంత నివాస గృహాలు లేవని, తరచూ అద్దెకు మారుతుంటారని, గతంలో ఒకసారి నమోదుచేసిన రికార్డులతో నేడు అవి సరిపోలకపోతే కొత్త సమస్యలు వస్తాయని వీరంతా ఏం కావాలని అన్నారు. వాస్తవానికి చట్టం కంటే ముందే రూల్స్‌ను రూపొందించారని ఆ విధంగా చట్టానికే గుర్తింపు లేదని పేర్కొన్నారు.
*చిత్రం... ఎంఐఎం నేత అక్బరుద్దీన్