తెలంగాణ

కళ్ల ముందు భారీ బడ్జెట్..లక్ష్యం చేరుకొనేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌కు వేసుకున్న అంచనాల లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు కేంద్రం నుంచి తగ్గుతున్న పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కు కోతలతో ఇంత భారీ బడ్జెట్ లక్ష్యానికి చేరుకోవడం సాధ్యమేనా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. గత ఏడాది కంటే వచ్చే సంవత్సరానికి భారీగా బడ్జెట్‌కు వేసుకున్న అంచనాలు ఆషామాషీగా వేసుకోలేదు. లక్ష్యానికి కేవలం రూ. 20 వేల కోట్లు మాత్ర మే తక్కువని ద్రవ్య వినిమయ బిల్లు ఆమో దం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. లక్షా 83 వేల కోట్లుగా ప్రతిపాదించగా అందులో లక్షా 63 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు కూడా సీఎం వెల్లడించారు. ఇది 2019-20 వార్షిక బడ్జెట్‌లో సవరించిన అం చనాల కంటే సుమారు రూ.40 వేల కోట్లు ఎక్కువ. రాష్ట్ర సొంత ఆదాయం (స్టేట్ ఓన్ రెవెన్యూ), కేంద్ర నుంచి రావాల్సిన రాష్ట్ర పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా ఇంత పెద్దమొత్తం లక్ష్యానికి చేరుకోవడం ఎలా సాధ్యమన్న సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలోనే ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.3,800 కోట్లు తగ్గిన
విషయం తెలిసిందే. అలాగే 15వ ఆర్థిక సంఘం చేసిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాతాన్ని కూడా స్వల్పంగా తగ్గించింది. తగ్గిన శాతం స్వల్పమే అయినా ఇది రాష్ట్రానికి రావాల్సిన మొత్తంలో సుమారు రూ.2,300 కోట్లు. పరిస్థితేమో ఇలా ఉంటే ప్రస్తుత బడ్జెట్ కంటే రూ.40 నుంచి 45 కోట్ల వరకు ఎలా పెరుగుతుందనేది వౌలికమైన ప్రశ్న. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా, ప్రభుత్వ భూములు, నిరర్ధక ఆస్తులు విక్రయించినా, మద్యం రేట్లు పెంచినా, ఇసుక, ఇతర మైన్స్ ఆదాయాన్ని పెంచుకోగలిగినా ఈ పెద్ద మొత్తం లక్ష్యానికి చేరుకోగలదా? అని సందేహం. ఈసారి ఆదాయాన్ని పెంచుకోవడానికి భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు వస్తుందని అంచనా వేసింది. ఇందులో రాజీవ్ స్వగృహ ఇళ్ల అమ్మకం కూడా ఉండడంతో రూ.10 వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మద్యం అమ్మకాల ద్వారా గత బడ్జెట్‌లో రూ.12,600 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని ఈసారి బడ్జెట్‌లో రూ.16 వేల కోట్లుగా అంచనా వేసింది. దాదాపు ఇది గత బడ్జెట్ కంటే రూ.3,400 కోట్లు ఎక్కువ. గత ఏడాది కూడా మద్యం రేట్లను పెంచిన తర్వాత వచ్చిందే ఈ మొత్తం. మరి వచ్చే ఏడాది దాదాపు రూ.3,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తుందంటే, మళ్లీ మద్యం రేట్లను పెంచబోతున్నట్టు శాసనసభలో సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఈ బడ్జెట్‌లో రూ.6,446 కోట్లున్న ఆదాయాన్ని వచ్చే సంవత్సరానికి రూ.10 వేల కోట్లుగా అంచనా వేసింది. ఇది కూడా ఎక్సైజ్ ఆదాయం మాదిరిగానే దాదాపు రూ.3,500 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ పెంచలేదని, ఈసారి పెంచబోతున్నట్టు పలు సందర్భాల్లో సీఎం వెల్లడించారు. ఇక ఇసుక, మైన్స్ ఆదాయాన్ని కూడా పెంచుకుంటామని సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ లెక్కల భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు, మద్యం అమ్మకాలపై రూ.3,500 కోట్లు, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.3,500 కోట్లు, ఇసుక, మైన్స్‌పై కూడా ఇంతే మొత్తం ఆదాయాన్ని పెంచుకోగలిగినా మొత్తంగా కాస్త అటుఇటుగా పెరిగే ఆదాయం రూ.20 వేల కోట్లకు పెరిగే అవకాశం లేదు. అలాంటప్పుడు సవరించిన గత బడ్జెట్‌తో పోలిస్తే లక్ష్యానికి ఇంకా రూ.20 వేల కోట్లు తక్కువ ఉండబోతుందని ఒక అంచనా.