తెలంగాణ

మావోల కదలికలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 17: రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టామని రాష్ట్ర పోలీస్ డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ నిట్ కళాశాల సమావేశ మందిరంలో వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ల పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, కరీంనగర్ రెండు ఉమ్మడి జిల్లాల పోలీస్ అధికారులకు నేరాలు అదుపుచేయడం కోసం తీసుకుంటున్న చర్యలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు. అదే విధంగా పోలీసులకు వివిధ అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఇటీవల మావోయిస్టుల యాక్షన్ టీం సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. అందులో భాగంగానే గత రెండు రోజులుగా స్వయంగా డీజీపీ తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులకు డీజీపీ దిశానిర్ధేశం చేశారు. యాక్షన్ టీం కట్టడిలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు, కార్డన్ సెర్చ్‌లు, నాకాబందీ నిర్వహించడంతో పాటు ముందస్తు సమాచారం సేకరించాలన్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించే హోంగార్డు స్థాయి నుండి స్టేషన్ అధికారి వరకు మావోయిస్టు వ్యవస్థపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. తగు రీతిలో అధికారులు నమోదైన కేసుల విచారణ చేపట్టి నేరస్థులకు శిక్ష పడే విధంగా
చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి విషయాల్లో పోలీస్ అధికారులు ఎలాంటి రాజీ లేకుండా చిత్తశుద్ధితో పోలీస్ శాఖల కీర్తిప్రతిష్టలు ఆధారపడి ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో పోలీసు అధికారులు ఇతర శాఖలతో మరింత సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తగ్గించుకోవద్దని ప్రజల పూర్తి స్థాయిలో రక్షణకై పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ప్రజలు నచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉందని ఆయన సూచించారు. ఈ విధంగా వ్యవహరిస్తేనే ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం పెరుగుతుందని అన్నారు. పోలీసులు, ప్రజలు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బందితో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా వారిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఐజీలు నాగిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్, కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనర్లు డాక్టర్ వీ రవీందర్, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ, ములుగు ఎస్పీ సంగ్రమ్‌సింగ్‌తో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్ ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

*చిత్రం...వరంగల్ నిట్‌లో జరిగిన వరంగల్, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన పోలీస్ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి