తెలంగాణ

అప్పుల ఊబిలో రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా సమాధానాలు దాటవేసే ధోరణిలో సాగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ సీఎల్‌పీ కార్యాలయంలో మాట్లాడుతూ ధనిక రాష్టమ్రైన తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుందామనే లక్ష్యంతో ప్రభుత్వం ఉ దన్నారు. రాష్ట్రం అప్పు రూ. 3.18 లక్షల కోట్లకు చేరుకుంటోందన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలో తెలంగాణ నంబర్ ఒన్‌గా నిలుస్తోందన్నారు. ఇదేమీ రాష్ట్ర ప్రగతికి సూచిక కాదన్నారు. మద్యం కుటుంబాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ఊరికి పది బెల్ట్‌షాపులు ఉన్నాయన్నారు. వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ యువత ఉద్యోగాల వాటా ఎంత అని ప్రశ్నించారు. 75 శాతం మంది తెలంగాణాయేతరులు ఉన్నారన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ యువత ఉద్యోగాల గురించి అడిగితే, కేటరింగ్ అవకాశాలు వచ్చాయని ప్రభుత్వం బదులిచ్చిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం రాయితీతో ఏర్పాటు చేసే పరిశ్రమలో 85 శాతం లోకల్ రిజర్వేషన్లు ఉండాలన్నారు. నిరుద్యోగులను ఉపాధి కల్పించడం లేదన్నారు.