తెలంగాణ

గిరిజనుల వికాస సంస్థలుగా ఐటీడీఏలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: గిరిజనుల సమగ్ర వికాసానికి ఉపయోగపడే సంస్థలుగా ఐటీడీఏలను రూపొందించాలని గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారులతో బుధవారం ఆమె దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సమీక్షించారు. ఐటీడీఏలు గిరిజన సమగ్ర వికాస కేంద్రాలుగా భాసిల్లేలా తీర్చిదిద్దాలన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని, కుటీర పరిశ్రమలు స్థాపించేందుకు సాయం చేయాలని సూచించారు. గిరిజనుల సమగ్ర వికాసానికి ఒక ప్రణాళిను రూపొందించి తనకు అందించాలని ఐటీడీఏ అధికారులకు మంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో కరోనావైరస్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. కరోనావైరస్‌పై ఆందోళన చెలరేగిన ఈ సమయంలో విద్యార్థుల భద్రత పట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మంచిమార్కులు తెచ్చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒకే గదిలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని కోరారు. విద్యార్థుల వద్దకు వారి తల్లిదండ్రులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏల్లో కరోనా రాకుండా చూడాలని, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, గిరిజన సంక్షేమ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్