తెలంగాణ

ప్రచారం చేపట్టిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: కరోనా వైరస్, నివారణ, రక్షణకు సంబంధించి పేదలు, గ్రామీణ ప్రజలకు సమాచారం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాంధీ ఆసుపత్రితో కలిసి ప్రజా రవాణా కేంద్రాలు, మురికి వాడల్లో ఒక నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఇక్కడ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీ శ్రవణ్‌కుమార్ ప్రారంభించారని హెల్పింగ్ హ్యాండ్ పేర్కొంది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎనిమిది మంది హెచ్‌హెచ్‌ఎఫ్ వలంటీర్ల బృందం నెల రోజుల పాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దగ్గు, తమ్ము వచ్చినప్పుడు పాటించాల్సిన పద్ధతులు, మాస్క్ వినియోగం , దానిని పారవేయడం, వీధుల్లో ఉమ్మివేయడం, వైరస్ సోకి ఉపరితలాల నుంచి ఎలా రక్షించుకోవాలనే దానిపై ఆచరణాత్మకంగా చేసి చూపిస్తారని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్తబా హసన్ ఆక్సారీ తెలిపారు.
ఎంఫైన్ యాప్ ద్వారా రోగులతో మాట్లాడుతున్న కార్పొరేట్ డాక్టర్లు
కరోనా వైరస్ నేపథ్యంలో కార్పోరేట్ ఆసుపత్రులు ఎంఫైన్ అనే యాప్ ద్వారా రోగులతో మాట్లాడుతున్నారు. ఈ పద్ధతిలో రోగులు ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేదు. ప్రధానంగా బయటి రోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చును. నెల రోజుల్లో నాలుగు వేల మంది ఎంఫైన్ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయని ఎంఫైన్ కో ఫౌండర్ సీఈవో ప్రసాద్ కొంపల్లి చెప్పారు. కరోనా వైరస్ వల్ల రోగులు ఆసుపత్రికి రావడం సంక్లిష్టంగా మారింది. దీంతో టెలిమెడిసిన్ పద్ధతిని అవలంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్లు, రోగలు ఎంఫైన్ యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుకోవచ్చును. డాక్టర్లు తాము ఇచ్చినన మందులు ఎలా పనిచేస్తున్నాయనేవిషయాన్ని కూడా రోగులతో మాట్లాడి తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు.