తెలంగాణ

దండం పెడతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్నవారు ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేకపోయినా బయట తిరగవద్దని చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, విదేశాల నుండి వస్తున్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం ఏ మాత్రం ఉన్నా, వెంటనే ఐసోలేట్ కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యక్తులు ఆరుబయట తిరగవద్దన్నారు. స్వయంగా దవాఖానాకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, స్వయం నియంత్రణ పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిన వారంతా విదేశాల నుండి వచ్చిన తెలంగాణ వ్యక్తులు లేదా, విదేశీయులేనని గుర్తు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా సోకకపోవడం గమనార్హమన్నారు. విదేశాల నుండి వస్తున్న వారికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం సీపోర్టుల్లో కూడా స్క్రీనింగ్ నిర్వహిస్తోందని సీఎం గుర్తు చేశారు. ఓడలలో వస్తున్న వారిని ఓడరేవుల్లోనే ఏపీ ప్రభుత్వం స్క్రీనింగ్ చేస్తోందన్నారు. విదేశాల నుండి దేశంలోని ఇతర నగరాలకు విమానాల్లో వచ్చి, ఆయా నగరాల నుండి తెలంగాణకు వస్తున్నవారు ప్రభుత్వానికి సహకరించాలని ప్రత్యేకంగా సీఎం కోరారు. తెలంగాణలోకి వచ్చిన వెంటనే పోలీసు అధికారులకు లేదా వైద్య సిబ్బందికి తెలియజేయాలని, కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులు కూడా బాధ్యతతో ఉంటూ, విదేశాల నుండి తమ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే ప్రభుత్వానికి
సమాచారం ఇవ్వాలని కోరారు. 2020 మార్చి 1 నుండి ఇప్పటివరకు విదేశాల నుండి తెలంగాణకు వచ్చిన వారి సంఖ్య 20 వేలకు పైగా ఉంటుందని, వీరిలో 11 వేల మందిని క్వారంటైన్ చేశామని సీఎం తెలిపారు. విదేశాల నుండి ఇతర రాష్ట్రాలకు వచ్చి, అక్కడి నుండి తెలంగాణకు ఎవరైనే చేరితే తొలుత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేసీఆర్ కోరారు. కరీంనగర్ సంఘటన తర్వాత ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇండోనేషియా నుండి వచ్చిన 10 మంది బృందంతో కరీంనగర్‌లో ఇబ్బంది వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వేర్వేరు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. కరోనా వైరస్ లక్షణాలు అనుమానం ఉన్నవారిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నామని చెప్పారు. కరోనా కట్టడి కోసం 5,274 నిఘా బృందాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా అనుమానితుల చేతిపై ఒక స్టాంపు వేస్తున్నామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఈ స్టాంపు వేసిన వ్యక్తులు నిర్దేశించిన రోజులపాటు సమాజంలో తిరగవద్దని, దవాఖానాల్లో చికిత్స చేయించుకోవాలని, ఐసోలేట్ అయి ఉండాలన్నారు. అందుకే విదేశాల నుండి వస్తున్నవారు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నామని సీఎం వివరించారు.
*చిత్రం... ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు