తెలంగాణ

నిజాం పాలనలో అభివృద్ధి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: నిజాం నవాబు పాలనలో అభివృద్ధికి అగ్రపీఠం వేశారని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నార్సింహరెడ్డి అన్నారు. నిజాముల పరిపాలనలో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, మంచినీటి చెరువులు, విద్యుత్, విమానయానం, రైల్వే, బస్సుల రవాణా, విద్య, ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యశాఖల పరిరక్షణకు నిజాం కాలం నాటి నుంచే బలమైన బీజాలు పడ్డాయని, దానికి అప్పటి నిజాం సలహాదారుగా ఉన్న మోతీలాల్ పిత్తి లాంటి వారి దూర దృష్టి ప్రముఖంగా గోచరిస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం బద్రివిశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్టు ఆధ్వర్యంలో మెరిట్ ర్యాంకులు సాధించి, ఉన్నత విద్య కోసం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న 450 మంది విద్యార్థులకు రూ. 70 లక్షల స్కాలర్‌షిప్‌లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శరద్ బి పిత్తి, ట్రస్టీలు అక్షయ్ ఎ పిత్తి, రాధిక ఎ పిత్తి, జి విజయ్‌కుమార్, అజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ, నిజాం నవాబుకు ఆర్థిక అవసరాలకోసం డబ్బులు సమకూర్చి ఆదుకున్న కుటుంబంగా పిత్తి వంశస్తులకు మంచి పేరుందన్నారు. బద్రివిశాల్ పిత్తి అప్పట్లో అన్ని రకాల ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడమే కాకుండా, పేదప్రజలకు ఆర్థిక సహకారాన్ని అందించారని, అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు శరద్ బి పిత్తి కొనసాగిస్తూ ప్రతి ఏటా సుమారు రెండు కోట్ల రూపాయలను పేదల విద్యాభ్యాసం కోసం స్కాలర్‌షిప్‌ల రూపంలో అందిస్తుండడం ముదావహమన్నారు. ఆరవ తరగతి మొదలుకొని పిజి విద్య దాకా సుమారు 1300 మంది విద్యార్థులకు రూ. 3250 నుంచి రూ. 12వేల వరకు ఆర్థిక సహాయాన్ని అందించడం గొప్ప విషయమని మంత్రి నాయిని అన్నారు.

చిత్రం.. మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్న రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి