జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/చింతూరు, జూలై 23: చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుంట డీఎస్పీ హరిశ్‌యాదవ్ నేతృత్వంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగరాజు పహాడ్ అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. సంఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు, విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రి లభ్యమయ్యాయి. మృతులు మైతా రీజియన్ ఆర్‌పీసీ అధ్యక్షుడు సున్నం తమ్మయ్య, ఆయుధాల మరమ్మతు, టెక్నికల్ సభ్యుడు మడకం ముయ్యలుగా గుర్తించారు.

చిత్రం.. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు