తెలంగాణ

ఐకెపి సిబ్బందికి వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: ఇందిరా క్రాంతి పథం (ఐకెపి) సిబ్బందికి వేతనాలు (పారితోషకం) పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐకెపి సిబ్బందికి పారితోషకాన్ని పెంచే ప్రతిపాదనను పంపించాలని సిఎం కెసిఆర్ సోమవారం ఆదేశించారు. తమ సర్వీసులను కూడా కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా క్రమబద్ధీకరించాలని ఐకెపి సిబ్బంది ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రపథకాల్లో పనిచేస్తున్న సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో కనీసం తమకు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పెంచినట్టు అయినా వేతనాలు పెంచాలని ఐకెపి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించిన సిఎం ఎట్టకేలకు ఐకెపిలో పని చేస్తున్న సిబ్బందికి పారితోషకం పెంచే ప్రతిపాదనను ప్రభుత్వానికి వెంటనే అందజేయాల్సిందిగా కమిషనర్‌ను ఆదేశించారు.