తెలంగాణ

దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25 : తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దళితులు ముందుకు వస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి టి-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇన్‌క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్యూనర్స్) పేరు పెట్టారు. దళితులకు ప్రోత్సాహకాలు అందించేందుకు వీలుగా సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2015 జనవరి 1 నుండి పరిశ్రమలు స్థాపించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తారు. 2019 మార్చి 31 వరకు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు లేదా విస్తరించేందుకు ముందుకు వచ్చేవారికి లబ్ధి చేకూరుతుంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారితో పాటు, ఇప్పటికే ఎవరైనా పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రస్తుతం వాటిని విస్తరించాలనుకున్నా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం నియమావళిని రూపొందించారు.