తెలంగాణ

టిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలే బాస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 5: తెలంగాణ ప్రజలే తమకు దేవుళ్లని, తప్పుచేస్తే వారే తమను శిక్షిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరులో మంగళవారం కెటిపిపి రెండోదశ 600 మెగావాట్ల పవర్‌ప్లాంటును ప్రారంభించి ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ తాను వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగసభలో కూడా తప్పుచేస్తే శిక్షించమని ప్రజలనే కోరానని, అందుకు వారు తనకు బ్రహ్మరథం పట్టి తీర్పు ఇచ్చారన్నారు. ప్రతిపక్షాలు ఉండాల్సిందేనని, ఉండడం సంతోషమేనని అయితే వారు వ్యక్తిగత నిందలు, విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వానికి గుణాత్మకమైన సూచనలు చేయాలే తప్ప నిందారోపణలు చేయడం సరైంది కాదంటూనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు తమదేనని పరోక్షంగా సంకేతం పంపారు. త్వరలోనే దళిత, మైనార్టీ విద్యార్థులకు 200 గురుకుల పాఠశాలలను ప్రారంభించబోతున్నట్లు సిఎం వెల్లడించారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్‌లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు భూసేకరణ కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆయన ఆదేశించారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా తెలంగాణ అసెంబ్లీకి మధుసూదనాచారి స్పీకర్ అయినప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేనేనని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కృషిని కెసిఆర్ ప్రశంసించారు. వరంగల్ జిల్లా ఆనాడు ఉద్యమాలకు అండగా ఉందని, మొన్న జరిగిన ఉప ఎన్నికలో కూడా ప్రభుత్వానికి మరింత ధైర్యం అందించే విధంగా ఉప ఎన్నికల తీర్పు ప్రజలు ఇచ్చారని, జిల్లాను తాను ఎప్పటికి మరచిపోనన్నారు. స్పీకర్ మధుసూదనాచారి కోరిక మేరకు భూపాలపల్లి నియోజకవర్గంలో 2 వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతేకాకుండా పిజి కళాశాల భవనం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు త్వరలోనే ఆదేశాలు ఇస్తానన్నారు. వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందని, ఏమి చేస్తే అభివృద్ధి అవుతుందో అధికారులతో చర్చించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తయారు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం, బొంధకారం అంటూ కొందరు పనికట్టుకొని ప్రచారం చేశారని, వారందరి అనుమానాలు పటాపంచలయ్యే విధంగా కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. తక్షణమే సిజెఎల్‌ఎంలను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా విద్యుత్ రంగంలో పనిచేసే అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కూడా రెండు రోజుల్లో శుభవార్త అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షత వహించగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, కొండా సురేఖ, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.